టాలీవుడ్ కి సంక్రాంతి పండగ పెద్ద సీజన్ అన్న సంగతి తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ సీజన్ లో ఖచ్చితంగా సిలిమా రిలీజ్ ఉంటున్నాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు చాలా వరకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంటాయి. ఇక ఈ పండగకి సినిమాలు రిలీజ్ చేయడం మన హీరోలందరికి పెద్ద సెంటిమెంట్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సీజన్ మన టాలీవుడ్ కే కాదు కోలీవుడ్ కి చాలా సెంటిమెంట్. అక్కడ రజనీకాంత్, అజిత్, విజయ్, సూర్య, ధునుష్ లాంటి స్టార్స్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీ పడుతుంటాయి.

 

అలాగే ఈ సారి కూడా మన టాలీవుడ్ స్టార్ హీరోలు 2021 సంక్రాంతికి పోటీ పడబోతున్నారని తాజా సమాచారం. చెప్పాలంటే ఇది ఈ సారి బాక్సాఫీస్ యుద్దమనే చెప్పాలి. వాస్తవంగా అయితే 2020 డిసెంబర్ లోపే ప్రభాస్, బాలకృష్ణ నటించిన సినిమాలు వచ్చేయాల్సింది. కాని కరోనా కారణంగా ఈ ఇయర్ లో రిలీజ్ కావాల్సిన సినిమాలు నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ సినిమాతో పాటు ఈ సినిమాలు అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవడం ఆ తర్వాత కరోనా ..దీంతో ఇప్పుడు ఈ సినిమా 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

 

ఇప్పటికే కంప్లీటవ్వాల్సిన ప్రభాస్ krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ సినిమా కూడా ఈ ఇయర్ రిలీజ్ అయ్యో అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటవలేదన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఇక బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ సినిమా కూడా సంక్రాంతికే ముస్తాబవుతుందట. బాలయ్యకి సంక్రాంతి సెంటిమెంట్ బాగా ఉంటుంది. ఇంతకముందు కూడా సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య సంచలనాలు సృష్ఠించాడు. అయితే ఈ సినిమాలతో పాటు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా సంక్రాంతికే వచ్చేందుకు రెడీ అవుతున్నారు. 

 

శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మొదలైనప్పుడే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా చెప్పారు. ఇక వెంకీ నారప్ప, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, నితిన్ రంగ్ దే, వరుణ్ తేజ్ బాక్సర్ ...ఇలా ఈ డిసెంబర్ లోపు రిలీజ్ కావాల్సిన సినిమాల లిస్ట్ పెద్దదే అయినా వాటిలో ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తారో తెలియని పరిస్థితి. ఒకవేళ అన్ని అనుకున్నట్టు గనక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో వస్తే మొత్తం పరిస్థితులు మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. మొత్తానికి ఈ సారి 2021 సంక్రాంతి రసవత్తరంగా మారబోతుందనమాట.   

మరింత సమాచారం తెలుసుకోండి: