ఆంధ్రప్రదేశ్ లో గత రెండు, మూడు రోజులుగా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టినా... మళ్లీ పాకిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.  కొత్తగా 48 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2205కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 803 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,353 మంది డిశ్చార్జ్ అయ్యారు.

 

రాష్ట్రంలో గత 24 గంటలలో కొత్తగా నమోదైన కరోనా కేసులలో కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 9 చొప్పున నమోదయ్యాయి. వీరిలో 31 మంది తమిళనాడు కొయంబేడు నుంచి వచ్చిన వారు ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 8, కృష్ణా జిల్లాలో 7, విశాఖపట్నం 4.. పశ్చిమగోదావరి, కడప జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.

 

ఇదిలా ఉంటే ఆరోగ్యశాఖ మరో కీలకమైన విషయాన్ని వెల్లడించింది. ఇతర రాష్ట్రాల వారికి సంబంధించిన కేసుల్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేసులు 150 ఉన్నాయని తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందినవారి కేసుల్ని ప్రత్యేకంగా నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లో కరోనా ను జయించిన మొట్టమొదటి జిల్లాగా ప్రకాశం అవతరించింది. ఇప్పటివరకు జిల్లాలో కరోనా పాజిటివ్ గా తేలిన వ్యక్తులందరూ ట్రీట్మెంట్ ద్వారా నయం కాగా ప్రతి ఒక్కరూ డిశ్చార్జి కావడం గమనార్హం. ఇప్పుడు జిల్లాలో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేకపోవడం మామూలు విషయం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ సరైన వైద్యం మరియు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే వ్యవస్థతో కరోనాను జయించవచ్చు అని నమ్మడం మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: