రంగస్థలం సినిమా చూసిన తర్వాత చాలా మందికి కలిగిన అభిప్రాయం ఒకటే... సమంతా గ్లామర్ కే కాదు నటన కు కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని.. ఆమె న‌ట‌న‌లో జీవించే స్తుంద‌ని భార‌త దేశ సినీ జ‌నాలే కీర్తించేశారు. ఆ సినిమా త‌ర్వాత అప్ప‌టి వ‌ర‌కు ఆమెపై ఉన్న గ్లామ‌ర్ ముద్ర పూర్తిగా తొల‌గిపోయింది. ఆ త‌ర్వాతే ఆమె జాను, ఓ బేబీ లాంటి సినిమాల‌తో న‌ట‌నా ప‌రంగా మ‌రింత కీర్తి శిఖ‌రాలు అందుకున్నారు. 

 

దర్శకుడి ఆలోచన సరిగా ఉంటే ఆమె సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని కూడా అంటూ ఉంటారు. పెళ్లి అయిన తర్వాత ఆమె చాలా చాలా వరకు మంచి పాత్రల్లోనే ఎక్కువగా నటించిన సంగతి తెలిసిందే. ఆమె పాత్రల గురించి అప్పటి నుంచి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమెను సుకుమార్ దర్శకత్వంలో వచ్చే పుష్ప‌ సినిమాలో తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. 

 

ఈ సినిమాలో ఆమె అల్లు అర్జున్ కి లవర్ గా నటిస్తారు అని ఆమె  పాత్ర చనిపోయే అవకాశం ఉందని అడవిలో ఉండే ఒక గిరిజన తెగ కు చెందిన అమ్మాయి అని అంటున్నారు. ఆ పాత్రకు ఆమెను అడగగా ఆమె అందుకు ఓకే చెప్పింది అని సమాచారం. త్వరలోనే ఆమె ఈ సినిమాలో నటించడానికి రెడీ కూడా అవుతుంది అని తెలుస్తుంది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది. 

 

స‌మంత సుక్కూకి మంచి ల‌క్కీ ప‌ర్స‌న్ అయ్యింది. రంగ‌స్థ‌లం సినిమాలో ఆమె న‌ట‌న‌తో అద‌ర గొట్టేసింది. ఇక ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తూ స‌మంత‌ను తీసుకుంటున్నాడ‌ట‌. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కూడా చాలా వరకు కష్టపడుతున్నాడు. అతని పాత్ర కోసం సుకుమార్ అయితే బాగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నాడు అని టాలీవుడ్ లో టాక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: