‘బాహుబలి’ ఇచ్చిన స్ఫూర్తితో ‘ఆర్ ఆర్ ఆర్’ మరింత భారీస్థాయిలో పాన్ ఇండియా మూవీగా దేశంలోని అనేకభాషలలో రిలీజ్ చేయడానికి రాజమౌళి ఎన్నో వ్యూహాలు రచించాడు. దీనికోసం ఈసినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను పూణేలో చిత్రీకరించడానికి రాజమౌళి ప్రయత్నించినప్పుడు గతంలో రామ్ చరణ్ మోకాలుకు జరిగిన ప్రమాదం అడ్డుపడిన విషయం తెలిసిందే. 


రాజమౌళి పూణే షెడ్యూల్ ఆలోచనలకు మహారాష్ట్రను కుదిపేస్తున్న కరోనా అడ్డుతగలడంతో ఇప్పుడు ఆ సీన్స్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకమైన సెట్స్ వేసి పూణే వాతావరణం కనిపించే విధంగా చిత్రీకరించడానికి రాజమౌళి ఒక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు రామోజీ ఫిలిం సిటీలో కొందరు సెట్ డిజైనర్స్ పూణే వాతావరణం కనిపించే విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి సెట్స్ డిజైన్ చేసే పని ప్రారంభించినట్లు తెలుస్తోంది. 


ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన షూటింగ్ అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే జరగబోతోంది. దీనితో ఈసినిమాను పూర్తిగా హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నా సినిమాను మాత్రం జాతీయస్థాయి ఇమేజ్ క్రియేట్ అయ్యే విధంగా పాన్ ఇండియా మూవీ అన్న బిల్డప్ రాజమౌళి ఇస్తూ దేశంలోని అనేక భాషలలో ఈమూవీ విడుదల చేయడానికి రాజమౌళి కరోనా కల్పించిన పరిస్థితులతో పోరాటం చేస్తూ తన వ్యూహాలను మార్చుకుంటున్నాడు. 


ఈపరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉంటే తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా చేసిన కామెంట్స్ అందరికీ షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం కరోనా ప్రభావం ఏమాత్రం తగ్గని నేపథ్యంలో థియేటర్లు తెరిస్తే సమస్య తీవ్రమవుతుంది అనీ ప్రజలు కూడ థియేటర్లకు వచ్చే ఆలోచన చేస్తారని తాను అనుకోవటం లేదనీ భౌతిక దూరం ఉండేలా థియేటర్ల సీటింగ్ మార్చాల్సి ఉంది అని అభిప్రాయపడుతూ ఈ నిబంధనకు మల్టిప్లెక్స్ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నా సింగిల్ స్క్రీన్స్ తో పాటు పట్టణాలు గ్రామాల్లోని థియేటర్లు ఆర్ధిక భారాన్ని మోయలేవు అంటూ చేసిన కామెంట్స్ చాలమందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఇదేసందర్భంలో మంత్రి మాట్లాడుతూ ధియేటర్లు 3 లేదా 4 నెలల పాటు తెరవడం ఆలస్యం అయినా ఆశ్చర్యం లేదు అని అనడం బట్టి షూటింగ్ లు కూడ అదేవిధంగా వాయిదా పడతాయా అన్న టెన్షన్ లో అనేకమంది ప్రముఖ దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: