తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ వ్యాప్తి ఎప్పటికి తగ్గుతుందో ఎవరికి సమాధానం లేని ప్రశ్నగా మారింది. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతూ ఉన్నా అనేక రంగాలకు మినహాయింపులు ఇస్తున్న పరిస్థితులలో సినిమా థియేటర్స్ పరిస్థితి మటుకు అగమ్యగోచరంగా ఉంది. దీనితో చూడడానికి సినిమాలు లేకపోవడంతో జనం అంతా తమ వినోదం కోసం ఓటీటీల మీద ఆధారపడుతున్నారు. 


ఇలాంటి పరిస్థితులలో అల్లు అరవింద్ ప్రారంభించిన ఆహా ఒటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ నెట్ ఫ్లిక్స్ లతో పోటీ పడలేకపోతోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ లాక్ డౌన్ సమయంలో మిగతా ఓటీటీలు అన్నీ లాభాపడుతూ ఉంటే ఆహా ఇంకా ఇబ్బందిపడుతూనే ఉంది. నాణ్యత లేని కంటెంట్ కారణంగా ప్రేక్షకులను ఆకర్షించడంలో ఆహా విఫలమవుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 


దీనితో ఆహా ను నిలబెట్టడానికి అల్లు అరవింద్ ముంబై నుండి ఒక ప్రత్యేక బృందం సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆహా కోసం మంచి కంటెంట్ సమకూర్చడమే ఈ బృందం పని అని టాక్. అయితే వారు విఫలం కావడంతో ఇప్పుడు ఈ సీనియర్ నిర్మాత కొంతమంది తెలుగు దర్శకులను కన్సల్టెంట్లుగా ఆహా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


వంశీ పైడిపల్లి నందిని రెడ్డి చంద్ర సిద్ధార్థ్ వి.ఐ. ఆనంద్ వంటి దర్శకులు ఆహా కు మంచి స్క్రిప్ట్స్ మరియు చిత్ర దర్శకులను ఎన్నుకోవటానికి సహాయం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లాక్‌ డౌన్ కొనసాగుతున్న పరిస్థితులలో షూటింగ్‌లు లేకపోవడంతో చాలామంది దర్శకులు ఖాళీగా ఉన్నారు. దీనితో వీళ్ళంతా రంగంలోకి దిగితే ఆహా గట్టెక్కుతుంది అన్న ఆసతో అరవింద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా అరవింద్ ఒక ప్రముఖ దర్శకుడు చేత వెంకటేష్ ను కీలక పాత్రలో పెట్టి అతడికి భారీ పారితోషికం ఇస్తూ ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ ను నిర్మించే ఆలోచన చేస్తున్నాడని వంశీ పైడిపల్లి ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: