ఆర్ ఎక్స్ ౧౦౦ సినిమాలో హీరోయిన్ గా నటించి ముద్దుసీన్లతో కుర్రకారుకి కైపెక్కించిన భామ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్, ఆ తర్వాత ఆర్డీఎక్స్ లవ్ అంటూ డోసు మరింత పెంచడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆర్ ఎక్స్ ద్వారా ఎంత పాపులర్ అయిందో ఆర్డీఎక్స్ ద్వారా అంతగా పేరు చెడగొట్టుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తున్న పాయల్ లాక్డౌన్ సమయాన్ని చాలా ప్రొడక్టివ్ గా వాడుకుంటుంది.

 


ఈ క్వారంటైన్ టైమ్ లో షార్ట్ ఫిలిమ్ తో మనముందుకు వచ్చింది. కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో ఎంతో మంది ముగుళ్ళు తమ భార్యల్ని గృహహింసకి గురిచేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. లాక్డౌన్ లో వారి పరిస్థితి ఎవరికీ చెప్పుకోలేక లాక్ వేసినట్టయింది. అయితే ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా ఆ మహిళలకి మద్దతుగా నిలవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు.

 

అయితే ఇదే అంశాన్ని తన షార్ట్ ఫిలిమ్ లో ఎత్తి చూపింది. ౧౬నిమిషాల నిడివి గల ఈ లఘుచిత్రంలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పాత్ర రైటర్ గా కనిపిస్తుంది. అయితే ఆమె భర్త రోజూ ఇబ్బంది పెడుతుండడం వల్ల రచన సరిగ్గా సాగకపోయేది. భర్త హింస రోజు రోజుకీ పెరిగిపోవడంతో ఒకానొక రోజు అతన్ని చంపేస్తుంది. మొత్తంగా ఇదే స్టోరీ. రైటర్ అనే టైటిల్ తో విడుదల చేసిన ఈ షార్ట్ ఫిలిమ్ కాన్సెప్ట్ బాగుందని ప్రశంసలు దక్కుతున్నాయి.

 

ఇందులో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ మేకప్ లేకుండానే కనిపించడం విశేషం. ఈ షార్ట్ ఫిల్మ్ ని పాయల్ స్నేహితుడు సౌరభ్ ధింగ్రా దర్శకత్వం వహించాడు. ఇంటి వద్దే ఉన్న అన్ని సౌకర్యాలతో చాలా పకడ్బందీగా చెప్పాల్సిన పాయింట్ చాలా కరెక్ట్ గా చూపించారని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి లాక్డౌన్ లో తెలుగు నేర్చుకోవడంతో పాటు ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రేక్షకులకి దగ్గరవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: