సాధారణంగా బ్లాక్ అండ్ వైట్‌ సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్‌, లిక్‌ లాక్‌లు, బెడ్‌ రూమ్ సీన్స్ కనిపించవు. అలాంటి సిచ్యువేషన్ వస్తే పూలు, గొడుగులు, చెట్ల పొదలు అడ్డు పెట్టి కవర్ చేస్తారు. అయితే అన్ని సందర్భాల్లో అలా కాదు.

 

ఇండియన్ స్క్రీన్‌ మీద తొలి లిప్‌ లాక్‌ సినిమా పుట్టిన తొలి నాళ్లలోనే వచ్చింది. 1929లోనే తొలి లిప్‌ లాక్‌ సీన్స్‌ను తెరకెక్కించారు మన దర్శక నిర్మాతలు. కనీసం టాకీ సినిమాలు కూడా ప్రారంభం కాకముందే ఈ లిప్‌ లాక్‌ వెండితెర మీద సెగలు పుట్టించింది.

 

1929లో రిలీజ్‌ అయిన బాలీవుడ్‌ సైలెంట్ సినిమా ఏ త్రో ఆఫ్ డైస్‌. ఈ సినిమాలో సీతా దేవీ, చారు రాయ్‌ మీద ఓ లిప్‌ లాక్‌ సీన్‌ను చిత్రీకరించారు. మహాభారతంలోని ఓ ఘట్టాన్ని ఈ సినిమా కథగా ఎంచుకున్నారు. రంజిత్, సోహాన్ అనే ఇద్దరు రాజులు సునీత అనే అమ్మాయిని ఇష్టపడటం అనే కథతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది.

 

ఈ సినిమాను ఇటీవల డిజిటల్‌లో రిస్టోర్ చేయటంతో అప్పట్లోనే లిప్‌ లాక్‌ సన్నివేశం తెరకెక్కించిన విషయం ఈ జనరేషన్‌కు అర్థమైంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ అయిన తరువాత చాలా కాలం పాటు ఇండియన్‌ స్క్రీన్‌ మీద లిప్‌ లాక్‌ తెరకెక్కించే సాహసం ఎవరూ చేయలేదు.

 

2006లో బ్రిటీష్ ఫిలిం ఇన్సిటిట్యూట్‌ ఈ సినిమాను డిజిటలైజ్‌ చేసింది. భారత దేశానికి స్వతంత్ర్యం వచ్చిన 60 సంవ్సతరాలు అయిన సందర్భంగా ఈ సినిమాను డిజిటలైజ్‌ చేశారు. తరువాత 2008లో ఈ సినిమాను సరికొత్త బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో రీ రిలీజ్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: