‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ పట్ల అందరిలోనూ మంచి గౌరం ఉంది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ ప్రభాస్ తో ఒక భారీ మూవీ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అవుతూ ఆమూవీ స్క్రిప్ట్ పనులలో ఈ లాక్ డౌన్ పిరియడ్ లో చాల బిజీగా ఉన్నాడు. 


అశ్వినీ దత్ అల్లుడుగా మంచి క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ అనుకోకుండా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో పెను దుమారాన్ని సృష్టించడమే కాకుండా అతడి పై తీవ్రవిమర్శలు వచ్చేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కరోనా సమస్య వల్ల ధియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో అసలు ఓపెన్ అయినా జనం ధియేటర్స్ కు వస్తారా రారా అన్నసంద్గిధంలో ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలు ఉన్నాయి.


ఇలాంటి పరిస్థితులలో నాగ్ అశ్విన్ ధియేటర్లు ఓపెన్ అయిన తరువాత జనం విపరీతంగా ధియేటర్స్ కు రావాలి అంటే ధియేటర్స్ కు వచ్చే ప్రేక్షకులకు  ప్రేక్ష‌కుల‌కు వైన్‌ - బీర్ అందించే విధంగా థియేట‌ర్లు లైసెన్స్ పొందితే సినిమా చూడ్డానికి వ‌చ్చే వారి సంఖ్య పెరుగుతుంది అంటూ కామెంట్స్ చేసాడు. ట్విటర్ వేదికగా నాగ్ అశ్విన్ తన అభిమానులతో ఛాట్ చేస్తూ వెలుబుచ్చిన ఈ అభిప్రాయం ఒకేసారి వైరల్ గా మారి అందరి దృష్టిలోను పడేలా చేసింది. 


ఎంతోమంది కళాకారులు రచయితలు దర్శకుల సమిష్టి కృషితో మంచి సినిమాలు వస్తాయని అలాంటి సినిమాలను కళా ఖండాలుగా జనం ఆరాదిస్తారని అంతమంచి అభిప్రాయం ఉన్న సినిమాను ప్రదర్శించే ధియేటర్లను బార్లతో సమానం చేస్తూ నాగ్ అశ్విన్ పోల్చడం ఎంత వరకు సమంజసం అంటూ చాలామంది విమర్శలు చేస్తున్నారు. అయితే యాధృశ్చికంగా నాగ్ అశ్విన్ చేసిన ఈకామెంట్స్ వెనుక ఒక అర్ధం ఉంది అని మరికొందరు అంటున్నారు. కరోనా దెబ్బతో జనం దగ్గర డబ్బు లేకపోయినా వైన్ షాపులు ఓపెన్ కాగానే కిలోమీటర్ల కొద్ది మందు బాబులు మందు కోసం ఓపికగా క్యూలో నిలబడినట్లుగా ఇదే మందును ధియేటర్లలో కూడ అందుబాటులో ఉంచితే ధియేటర్లు కిటకిటలాడుతాయి అన్న తన అభిప్రాయాన్ని సెటైరికల్ గా చెప్పడానికి ప్రయత్నించి అనవసరంగా నాగ్ అశ్విన్ విమర్శల పాలు అయ్యాడు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..      

 

మరింత సమాచారం తెలుసుకోండి: