టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ హెబ్భా పటేల్ కుమారి 21ఎఫ్ సినిమాతో పాపులర్ అయ్యింది. అంతకుముందు చేసిన అలా ఎలా సినిమా ఎవరికీ తెలియకపోయినా సుకుమార్ రైటింగ్స్ లో ఆయనే నిర్మించిన కుమారి 21ఎఫ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో రాజ్ తరుణ్, హెబ్భా పటేల్ ల రొమాన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక ఆ సినిమాతో బోల్డ్ ఇమేజ్ సాధించిన హెబ్భా తాను చేసే సినిమాలన్నిటిలో అంతే హాట్ గా కనిపించసాగింది. 

 

ఇక లిప్ లాక్, హాట్ సీన్స్ కు ఎలాంటి అడ్డు చెప్పని హెబ్భా పటేల్ ఆదిత్ అరుణ్ హీరోగా తెరకెక్కిన 24 కిస్సెస్ సినిమాలో లిప్ లాక్ తో కిక్కు ఎక్కించింది. అయోధ్య కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హెబ్భా పటేల్ మూతి ముద్దుల హంగామా మాములుగా ఉండదు. అయితే సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని తన పెదాలను రాసి ఇచ్చేసిన హెబ్భా సినిమాతో ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేదు. ఆ సినిమా తర్వాత హెబ్భా పటేల్ కేవలం స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. 

 

నితిన్ హీరోగా రీసెంట్ హిట్ కొట్టిన భీష్మ సినిమాలో వాంప్ పాత్రలో కనిపించి షాక్ ఇచ్చింది హెబ్భా.. ఇక రామ్ రెడ్ సినిమాలో కూడా అమ్మడు ఓ స్పెషల్ ఐటం సాంగ్ చేస్తుంది. రీసెంట్ గా రామ్ బర్త్ డే కానుకగా ఆ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లో కూడా హెబ్భా పటేల్ అదరగొడుతుంది. అక్కడ కూడా ఎలా కనిపించేందుకైనా సిద్ధం అంటుంది. మరి హెబ్భా ఈ ప్రయత్నాల్లో ఏదైనా క్లిక్ అయ్యి మళ్ళీ కెరియర్ ఫామ్ లోకి వస్తుందేమో చూడాలి.              

మరింత సమాచారం తెలుసుకోండి: