దగ్గుబాటి వారసుడు రానా రొమాన్స్ లో కూడా అదరగొడతాడు. కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తూ అందులో ఆడియెన్స్ ను అలరించే రొమాన్స్ కూడా ఉండేలా జాగ్రత్తపడతాడు రానా. పూరి డైరక్షన్ లో రానా హీరోగా నటించిన సినిమా నేను నా రాక్షసి. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. పోకిరితో ఇలియానాకు సూపర్ హిట్ ఇచ్చిన పూరి నేను నా రాక్షసి సినిమాలో తీసుకున్నాడు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. 

 

ఈ సినిమాలో రానా, ఇలియానా లిప్ లాక్ సీన్ ప్రేక్షకులను అలరించింది. హాట్ బ్యూటీ ఇలియానా మంచి ఫామ్ లో ఉన్న టైం లో ఆ లిప్ లాక్ అప్పట్లో హాట్ న్యూస్ గా మారింది. ఆడియెన్స్ ను ఆకట్టుకోవాలంటే ఆమాత్రం చేయక తప్పదు. అంతెందుకు ఇలియానా తెలుగు తెరంగేట్రం చేసిన సినిమా దేవదాస్ సినిమాలోనే రామ్ తో లిప్ లాక్ కానిచ్చింది. ఆ తర్వాత మహేష్ తో పోకిరి సినిమాతో కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టింది. రానాతో మాత్రం ఏకంగా లిప్ లాక్ తో రెచ్చిపోయింది. 

 

తెలుగులో సూపర్ ఫామ్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడకు వెళ్లిన ఇలియానా అక్కడ సరిగా క్లిక్ అవలేదు. ఇక మళ్ళీ తెలుగులో చేయాలని ట్రై చేసినా వర్క్ అవుట్ కాలేదు. కొన్నాళ్ళు ఫారిన్ బోయ్ ఫ్రెండ్ తో డేటింగ్ లో ఉన్న ఇల్లి బేబీ ఇప్పుడు ఎలాంటి ఆఫర్ వచ్చినా చేసేందుకు సై అంటుంది. మరి అమ్మడికి మళ్ళీ కోల్పోయిన ఫామ్ తిరిగి వస్తుందా.. అలాంటి సినిమాలు వస్తాయో లేదో చూడాలి. తనకు పరిచయం ఉన్న దర్శక నిర్మతలకు టచ్ లో ఉంటూ ఒక్క ఛాన్స్ అంటూ ఇలియానా రిక్వెస్ట్ చేస్తుందని తెలుస్తుంది. రవితేజ, శ్రీను వైట్ల కాంబోలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించిన ఇలియానామూవీ ప్లాప్ అవడంతో వెనుకపడ్డది. 

మరింత సమాచారం తెలుసుకోండి: