విక్టరీ వెంకటేష్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ‘కలియుగ పాండవులు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమ‌య్యాడు విక్టరీ వెంకటేష్.  1986 ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్‌గా నిలిచింది. మొదటి సినిమాతోనే వెంకీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు రూపొందించిన ఈ సినిమాను రామానాయుడు స్వయంగా నిర్మించారు. అయితే వాస్త‌వానికి అమెరికాలో ఎంబీఏ చదువు పూర్తి చేసుకువచ్చిన వెంకటేష్ నిజానికి అన్న‌ సురేష్ బాబులానే, చిత్ర నిర్మాత లేదా, ఓ వ్యాపారవేత్తగా ఎదగాలనుకున్నారు. 

 

కలియుగ పాండవులు చిత్రం తీయడం కోసం హీరో కొరకు వెతుకుతున్న రామానాయుడు గారికి, వెంకటేష్ ని చూసిన ఓ దగ్గరి వ్యక్తి, ఎవరికోసమో వెతకండం దేనికండీ, వెంకటేష్ బాబు హీరోగా చక్కగా సరిపోతారు, బాబుతోనే ఈ మూవీని తీయండి అని సలహా ఇచ్చారట. అలా సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన కలియుగ పాండవులు చిత్రం ద్వారా వెంకీ చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఇక ఆ త‌ర్వాత ఎన్నో విజ‌యాల‌ను వెంక‌టేష్ అందుకున్నాడు. ఇక ముఖ్యంగా `బొబ్బిలి రాజా` చిత్రంతో వెంక‌టేష్‌కు మంచి స్టార్‌డమ్ అందుకున్నాడు. 

 

సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా, సొంత టాలెంట్ తో త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు వెంకటేష్. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అయిన తండ్రి రామానాయుడు అండతో తొలిఅడుగులు వేసిన‌ప్ప‌ట‌కి.. తనదైన ప్రతిభతో మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్నిరకాల ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని స్టార్ హీరోగా ఎదిగి.. నిజ‌మైన విజేత‌గా నిలిచాడు. ఇక ప్ర‌స్తుతం వెంక‌టేష్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌ను ఎంచుకుంటూ భారీ హిట్లు కొడుతున్నారు. కాగా, ఎఫ్ 2, వెంకీమామ వరుస హిట్లతో జోరు మీద ఉన్న విక్టరీ వెంకటేష్.. ఇప్పుడు తమిళ అసురన్.. తెలుగులో ‘నారప్ప’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


 

  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: