తెలుగులో ప్యాన్ ఇండియా గా తెరకెక్కుతున్న ట్రిపు ల్ ఆర్ సినిమా ఇప్పటికే ఒకసారి వాయిదా పడింది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో వస్తున్న ఈ సినిమా ఈ జులై కి రిలీజ్ అవ్వాల్సింది కానీ  షూటింగ్ డిలే  తో  జనవరికి వెళ్లింది.  మళ్లీ అంతలోపే  కరోనా దెబ్బకి లాక్ డౌన్ వచ్చింది. దాంతో  మళ్లీ షూటింగ్స్, షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడిప్పుడే పరిస్తితి బెటర్ అవ్వడంతో పాటు  జూన్,జులై నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే పరిస్తితి కనిపిస్తోంది.

 

ఆల్రెడీ ఒకసారి  పోస్ట్ పోన్ అయ్యింది బట్.. ట్రిపుల్ ఆర్‌  ఎట్టి పరిస్తితుల్లో  మళ్లీ పోస్ట్ పోన్ అయ్యేది లేదు, నెక్ట్స్ జనవరికి రిలీజ్ చెయ్యాల్సిందే అని పట్టుమీదున్నాడు రాజమౌళి . అందుకే లాక్ డౌన్ టైమ్ లో కూడా తన టీమ్ తో పనిచేయిస్తున్నాడు .అయితే ఇప్పటి వరకూ సినిమా 75 పర్సెంట్ అయిపోయిందని, షూటింగ్ పార్ట్ కి సంబందించి ఎడిటింగ్ కూడా అయిపోయిందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని క్లారిటీ ఇచ్చాడు  రాజమౌళి.

 

ఇప్పటి వరకూ షూట్ అయిన పార్ట్ కి  సంబందించి పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ జరుగుతోందని చెప్పిన రాజమౌళి.. మిగిలిన్ 25 పర్సెంట్ సినిమాని లాక్ డౌన్ తర్వాత ఎలా చెయ్యాలో పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నాడు. దానికి తగినట్టు రీషెడ్యూల్ చేసి యాక్షన్ ప్లాన్ రెడీ చేశాడు . ఏ సీన్లు తక్కువ మందితో కంప్లీట్ చెయ్యొచ్చు, ఏ సీన్స్ కి లోకల్ యాక్టర్స్ అవసరం అవుతారో చూసుకుని వాటిని ముందుగా ఫినిష్ చేస్తానంటున్నాడు.

 

ట్రిపుల్ ఆర్ కోసం ఫారెన్  నుండి యాక్టర్స్ తో పాటు టెక్నిషియన్స్ రావాల్సి ఉంది. అంతేకాదు సెట్స్ వెయ్యడానికి కూడా వేరే వేరే రాష్ట్రాలనుంచి డిజైనర్స్ రావాల్సి ఉ:టుంది. బట్..ఇప్పుడు వాళ్లెవరూ వచ్చే పరిస్తితి లేకపోవడంతో .. వాళ్లకసం వెయిట్ చెయ్యకుండా లోకల్ ఆర్టిస్టులతో వీలైనంత త్వరగా సెట్స్ కంప్లీట్ చేసేస్తాం అంటున్నాడు జక్కన్న. అంతేకాదు .. ఇక్కడున్న వాళ్లతో ఫస్ట్ షూటింగ్  ఫినిష్ చేసుకుని.. వేరే ప్రదేశాల నుంచి రావల్సినవాళ్లతో లాస్ట్ కి షూట్ ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పని కూడా యాజ్ పర్ టైమ్ ఫినిష్ అవుతుందని , అందుకే ట్రిపుల్ ఆర్ ని రీ షెడ్యూల్  చేస్తున్నట్టు చెప్పాడు ఈ దర్‌శక థీరుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: