రాజమౌళి అత్యంత ప్రతిష్టత్మాకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ డెభ్భైశాతం షూటింగ్ జరుపుకుంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరుస్తుండగా, ఎన్టీఆర్ పక్కన బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ కనిపిస్తుంది. అయితే లాక్డౌన్ కారణంగా చిత్ర సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

 

 

లాక్డౌన్ లోనే చిత్ర మోషన్ పోస్టర్ తో పాటు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని ప్రెజెంట్ చేసిన రాజమౌళి, ప్రేక్షకులమ్ందరినీ మెస్మరైజ్ చేశాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ అలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. మనం ఊహించని విధంగా చూపిస్తూనే, అద్భుతంగా చూపించాడు. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ని చూసినప్పటి నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి మొదలైంది.

 

 

ఎన్టీఆర్ పుట్టినరోజు దగ్గరపడుతున్న కారణంగా ఆర్.ఆర్.ఆర్ నుండి సర్ప్రైజ్ వస్తుందని భావిస్తున్నారు. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చూడబోతున్నామన్న ఆనందం అభిమానుల్లో రెట్టింపైంది. దీనికి తోడు నిర్మాత దానయ్య ఎన్టీఆర్ లుక్ రివీల్ అవుతుందని భరోసా కూడా ఇవ్వడంతో అభిమానులు ఆనందంగా ఉన్నారు. అయితే ఎన్టీఆర్ లుక్ వీడియోని రామ్ చరణ్ వీడియోతో పోల్చకూడదని అంటున్నారు.

 


ఎందుకంటే అది అన్ని వనరులూ అందుబాటులో ఉండగా పక్కాగా ప్లాన్ చేసి తీర్చిదిద్దిన వీడియో. కానీ తారక్ పుట్టిన రోజు ముందు చాలా పరిమితులున్నాయి. టీజర్‌ కోసం ప్లాన్ చేసిన విజువల్స్ తీయలేకపోయారు. కాబట్టి చరణ్ వీడియోలా ఇది ఉండదన్నది మాత్రం స్పష్టం. అయితే ఎంత పోలిక చూడకూడదనుకున్నా అభిమానులు పోలుస్తూనే ఉంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: