స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా వరుడు. ఈ సినిమాలో భాను శ్రీ మెహ్ర హీరోయిన్ గా నటించింది. పెళ్లిచూపులు లేకుండా డైరెక్ట్ గా పీటల మీద పెళ్లికూతురిని చూడటం అనే కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా వచ్చింది. అయితే అప్పటికే ఆ అమ్మాయిని ఒక విలన్ కావాలనుకోవడం.. పెళ్లి పీటల మీద ఉండగా పెళ్లి పందిరిలో బాంబ్ పెట్టి వాళ్ళను చెదరగొట్టడం జరుగుతుంది. ఈ సినిమాలో విలన్ గా ఆర్య నటించాడు. 

 

విలన్ నుండి తప్పించుకుని హీరో, హీరోయిన్ ఇద్దరు బయటపడే క్రమంలో ఒక ఘాటైన ముద్దు ఉంటుంది. ఆ సందర్భం చాల బాగా రాసుకున్నాడు డైరక్టర్ గుణశేఖర్. వరుడు సినిమా ఫలితం నిరాశపరచినా ఆ లిప్ లాక్ మాత్రం అందరిని సర్ ప్రయిజ్ చేస్తుంది. బన్నీ సినిమాల్లో లిప్ లాక్ చాల అరుదు. అది కూడా యాక్సిడెంటల్ అన్నట్టుగా చిత్రీకరిస్తారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య 2లో కూడా కాజల్ తో లిప్ లాక్ ఉంటుంది. లిఫ్ట్ లో ఆమె చేస్తున్న అల్లరిని భరించలేక ఆమె పెదాలకు లాక్ వేస్తాడు అల్లు అర్జున్. 

 

వరుడులో మాత్రం అలా కాదు అదరచుంబనం అంటే ఇదే అన్నంతగా బన్నీ, భాను శ్రీలు ఇన్వాల్వ్ అయ్యారు. స్టార్ హీరోల సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ చాలా తక్కువ ఉంటాయని చెప్పొచ్చు. స్టార్ హీరోల సినిమాల్లో కంటెంట్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అవసరం అనుకుంటే మాత్రం లిప్ లాక్ కంపల్సరీ ఉంటుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా హీరోయిన్స్ తో లిప్ లాక్ కంపల్సరీ అంటే మాత్రం వెనుకడుగు వేసేది లేదని అంటాడు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: