పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగ ఉన్నప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన గొంతు బలంగా వినిపిస్తూ ప్రజల మధ్యలోనే గడుపుతున్న పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ ని మళ్ళీ తెరమీద చూడాలనుకున్న వారికి పవన్ మంచి శుభవార్త చెప్పడంతో ఎగిరిగంతేశారు. అయితే ౨౦౨౪ ఎన్నికల ముందు వరకి ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యాడు.

 

ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామా చేస్తున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యాడు. అయితే హరీష్ సినిమా ఇంకా సెట్స్ మీదకి రాలేదు. ప్రస్తుతానికి వకీల్ సాబ్ తో పాటు క్రిష్ పీరియాడికల్ డ్రామాలోనూ నటిస్తున్నాడు. మొఘలుల కాలం నాటి కథతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓ బందిపోటటు దొంగగా కనిపించనున్నాడట.

 


అయితే ఈ సినిమా షూటింగ్ కోసం ఉత్తరాది రాష్ట్రాల్లో లొకేషన్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారట. కానీ కరోనా కారణంగా ఇతర రాష్ట్రాలు వెళ్ళే పరిస్థితి ఇప్పట్లో లేనందున అక్కడి లొకేషన్ ని హైదరాబాద్ లోనే సెట్ వేసి షూటింగ్ పూర్తిచేయాలని అనుకుంటున్నారట. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేవరకు ఇతర రాష్ట్రాల్లో సినిమా షూటింగులకి అనుమతి రానందున ఇక్కడే షూట్ చేసేద్దామని డిసైడ్ అయ్యారట.

 

ఈ మేరకు రామోజీ ఫిల్మ్ సిటీలో కొన్ని ప్రాంతాలని సెలెక్ట్ చేసుకున్నారట. ఆర్ట్ డైరెక్టర్ తో కలిసి డైరెక్టర్ క్రిష్ సెట్ ప్లాన్ కూడ పూర్తి చేసుకున్నారట. ప్రభుత్వం నుండి షూటింగులకి అనుమతి రాగానే ఇక్కడే వేసిన సెట్ లో సినిమా పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారట. ఒక్క పవన్ సినిమానే కాదు, తెలుగులో దాదాపు చాలా చిత్రాలు సెట్స్ వేసి వాటి చిత్రీకరణ జరుపుకోనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: