క్రిష్ 3 సినిమా భారీ తారాగణంతో రూ. 100 కోట్ల వ్యయంతో తెరకెక్కింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్, వివేక్ ఒబెరాయ్, ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, అమితాబచ్చన్ లాంటి ప్రముఖులు నటించారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం, ప్రొడక్షన్ స్క్రీన్ ప్లై అన్ని రాకేశ్ రోషన్ నే చేశాడు. ప్రపంచవ్యాప్తంగా 2013వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా వందల కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. హృతిక్ రోషన్, కంగనా రనౌత్ నటన ప్రదర్శన ప్రతి ఒక్కరికి బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ సినిమాటోగ్రఫీ కళ్ళు మిరిమిట్లు గొలిపేటట్టు ఉన్నాయి. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ డ్యూయల్ రోల్ లో నటించగా... తండ్రి పాత్ర అయిన కృష్ణ మెహ్రా కి భార్య పాత్రలో ప్రియాంక చోప్రా నటించింది.


ఈ సూపర్ హీరో హిందీ ఫిలింలో చూడదగ్గ సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా హృతిక్ రోషన్ మధ్య సాగే రొమాంటిక్ సన్నివేశాలు అందరి ప్రేక్షకులను కట్టిపడేశాయి అంటే అతిశయోక్తి కాదు. ప్రియాంక చోప్రా నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృతిక్ రోషన్ ని ముద్దు పెట్టుకున్న తర్వాత ప్రియాంక చోప్రా అతడి కళ్ళల్లోకి చూసే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. లిప్ లాక్ సీన్ లో ప్రియాంక చోప్రా మొహం లో పలికిన హావభావాలు ఒక్కసారి వీక్షిస్తే మర్చిపోలేరు. ఈ సన్నివేశాలు అందరి ప్రేక్షకులకు కనులవిందయ్యాయి.


ఇకపోతే, ప్రియాంక చోప్రా కి ముద్దు సన్నివేశాలలో నటించడం కొత్తేమి కాదు. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఐన క్వాంటికో లో నిజంగానే ఈమె లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి కేక పుట్టించింది. బహిరంగంగా అదర చుంబనాలు ఇచ్చిపుచ్చుకోవడానికి కూడా ఆమె ఎటువంటి నిర్మొహమాటం చూపించదు. ఇండియన్ మూవీస్ లలో ఆమె నటించక చాలా ఏళ్లు కావొస్తుంది. మళ్ళీ భారతదేశ ప్రేక్షకులు ముందుకు ఎప్పుడొస్తుందో చుడాలిక.



మరింత సమాచారం తెలుసుకోండి: