ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ దూసుకుపోతుంది సమంత. ఓవైపు అక్కినేనివారి కోడలిగా బాధ్యతా యుతంగా వ్యవహరిస్తూనే  మరోవైపు సినిమాల ద్వారా కూడా తమ సత్తా చాటుతోంది.  పెళ్లికి ముందు వరకు గ్లామర్ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం పెళ్లి తర్వాత మాత్రం కేవలం నటనకు ప్రాధాన్యమున్న వైవిధ్యమైన పాత్రలు మాత్రమే చేసుకుంటూ కెరీర్ ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతుంది. అయితే సమంత తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే. 

 

 

 ఈ క్రమంలోనే లిప్ లాక్ విషయంలో కూడా సమంత చాలా ధైర్యం చేసింది అనే చెప్పాలి. లిప్ లాక్ అంటే అది ఒక బూతు అన్నట్లుగా చూసే రోజుల్లో... లిప్ లాక్  టాలీవుడ్ లో సాధ్యం కాదు కేవలం బాలీవుడ్ హాలీవుడ్లో మాత్రమే సాధ్యం అనుకుంటున్న  సమయంలో...  సమంతమాయ చేసావే సినిమా తో లిప్ లాక్ సీన్ లతో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది అనే చెప్పాలి. ఇలా కెరీర్ మొదటి నుంచి పాత్ర డిమాండ్ చేస్తే లిప్ లాక్  ఇవ్వడానికి ఎక్కడా వెనుకడుగు వేయలేదు సమంత. ఇక పెళ్లికి ముందు ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి అలరించిన  విషయం తెలిసిందే .. 

 

 

 అయితే కేవలం పెళ్ళి వరకే సమంత ఇలాంటి లిప్ లాక్ సీన్లలో నటిస్తుందని పెళ్లి తర్వాత కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో  మాత్రమే నటిస్తోంది అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్టుగానే సమంత గ్లామర్ పాత్రలు దూరం పెట్టి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తోంది. కానీ లిప్ లాక్ సీన్లకు మాత్రం ఎక్కడా దూరంగా ఉండటం లేదు ఈ అమ్మడు. అక్కినేని వారి కోడలు అయినప్పటికీ పాత్ర డిమాండ్ చేస్తే లిఫ్ట్ చేయడానికి సిద్ధమే అంటోంది. అంతేకాదు ఏకంగా రంగస్థలం సినిమాలో  రామ్ చరణ్ తో లిప్ లాక్ సీన్లో నటించి అందరినీ షాక్ కి గురి చేసింది. అందుకే లిప్ లాక్ విషయంలో టాలీవుడ్ హీరోయిన్లలో ఏ హీరోయిన్ చేయనంత డేర్ చేస్తుంది సమంత.

మరింత సమాచారం తెలుసుకోండి: