ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో లిప్ లాక్ ఉండటం కామన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు సినిమాల్లో లిప్ లాక్ సీన్లు ఉంటే అదొక పెద్ద బూతు గా భావించే తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం లిప్ లాక్ లకు  బాగా అలవాటు పడిపోయారు. దీంతో సినిమాలో డీప్ గా లిప్ లాక్ ఉంటే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. దీంతో అటు దర్శకనిర్మాతలు కూడా లిప్ లాక్ సీన్లు తమ సినిమాల్లో పెట్టేందుకు సిద్దమవుతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎలా ఉన్నప్పటికీ చిన్న హీరోల సినిమాల్లో లిప్ లాక్ కాదు... ఏకంగా రచ్చ రచ్చ చేస్తున్నారు. 

 

 

 ఈ మధ్యకాలంలో బోల్డ్  పాత్రల్లో నటించడానికి హీరోయిన్ లు  కూడా ధైర్యం చేస్తూ ముందుకు వస్తున్నారు అనే చెప్పాలి. అయితే లిప్ లాక్ సీన్లు కి తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ హీరోయిన్ గా ప్రస్తుతం మారిపోయిన హీరోయిన్ బ్యూటీ క్వీన్  రష్మిక మందన అనే చెప్పాలి. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన రష్మిక మందన ఆ తర్వాత తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్  ని సంపాదించింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా రష్మిక కు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది అని చెప్పాలి. 

 

 

 ఇక ఈ సినిమాలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది రష్మిక మందన విజయ్ దేవరకొండ మధ్య జరిగిన లిప్ లాక్ సీన్లు. ఈ సినిమాకు ముందు అర్జున్ రెడ్డి అనే సినిమాతో విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్ లతో యూత్ అందర్నీ ఆకర్షించే కొత్త ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత సినిమాలో విజయ్ దేవరకొండ డీసెంట్ పాత్రలో నటించినప్పటికీ లిప్ లాక్ సీన్లు మాత్రం ఎక్కడా తక్కువ లేదు. అంతేకాదు వీరిద్దరి మధ్య ఉండి డీప్ లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులను తెగ ఆకర్షించాయి. రష్మిక కూడా లిప్లాక్ చేయడానికి ధైర్యం చేసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: