మామూలుగా ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాలో లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్న  విషయం తెలిసిందే. ఒకప్పుడు అసలు తెలుగు సినిమాల్లో లిప్ లాక్ అనేది లేకుండా ఉండేది. కానీ క్రమక్రమంగా ట్రెండ్ మారుతూ వస్తుంది. ప్రేక్షకులు కూడా ఈ లిప్ లాక్ సీన్లు బాగా ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ హాలీవుడ్ లో లిప్ లాక్ సీన్లు చూసి ఇలాంటివి టాలీవుడ్లో కూడా ఉంటే ఎంత బాగుండు అనుకున్న ప్రేక్షకులందరికీ అంతకుమించి లిప్ లాక్ సీన్లు ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కూడా దర్శనమిస్తున్నాయి.

 

 

 అయితే ప్రస్తుతం సార్ హీరోయిన్ ల దగ్గర నుంచి చిన్న హీరోయిన్ ల వరకు... సీనియర్ హీరోల దగ్గర నుంచి జూనియర్ హీరోల వరకు అందరూ తమ సినిమాల్లో డీప్ లిప్ లాక్ సీన్ లతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని లిప్ లాక్ సీన్లు వచ్చినప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే లిప్ లాక్  మాత్రం అక్కినేని వారి కోడలు సమంత... సూపర్ స్టార్ మహేష్ బాబు మధ్య ఉండే లిప్ లాక్  గురించి అనే విషయం తెలిసిందే. మామూలుగానే కెరీర్ మొదటి నుంచి లిప్ లాక్ ల ఎక్కడ అడ్డు చెప్పలేదు  సమంత... సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా లిప్ లాక్ సీన్ కి సై అనేసింది. 

 

 

 దూకుడు సినిమాలో సూపర్ స్టార్ కు జోడీగా నటించిన సమంత తనదైన క్యూట్ క్యూట్ అందాలతో ఎంతో మంది ప్రేక్షకులు ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఈ సినిమాలో సమంత సూపర్ స్టార్ మహేష్ బాబుకు లిప్లాక్ ఇస్తుంది. అయితే అది ఏదో కావాలనే ఇచ్చింది కాదు. యాక్సిడెంటల్ గా ఈ సినిమాలో సమంత మహేష్ బాబు మధ్యలో లిప్ లాక్ జరిగిపోతుంది. అయితే ప్రేక్షకులు ఊహించకుండా క్షణాల్లో ఈ లిప్ లాక్ సీన్ ముగిసిపోతుంది. అందుకే ఈ లిప్ లాక్ సీన్ ఎప్పుడు వచ్చిన ప్రేక్షకులు వన్స్ మోర్ అన్నట్లుగా ఫీలవుతూ వుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: