గత కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలన్నీ లిప్ లాక్ సీన్లకు కాస్త దూరంగానే ఉంది. ఒకవేళ లిప్ లాక్ సీన్లు ఉన్న అది ఏదో నార్మల్ గా తప్ప డీప్ లిప్ లాక్ సీన్లు మాత్రం ఎక్కడా కనిపించేవి కాదు. అయితే అటు ప్రేక్షకులు కూడా అలాంటి సాదాసీదా లిప్ లాక్ సీన్ లతోనే సర్దుకుపోయే వారు. కానీ ఎప్పుడైతే అర్జున్ రెడ్డి సినిమా వచ్చిందో... ఇక అప్పటినుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త ట్రెండ్ సృష్టించబడింది అనే చెప్పాలి. 

 

 

 విజయ్ దేవరకొండ హీరో గా శాలిని పాండే హీరోయిన్గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతే కాదు విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసింది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో శాలిని పాండే మొదటి సినిమా అయినప్పటికీ లిప్ లాక్ సీన్లలో ఎంతో ధైర్యం చేసి నటించింది. కాస్త బోల్డ్ పాత్ర అయినప్పటికీ శాలిని పాండే మాత్రం ఎక్కడా వెనకడుగు వేయలేదు. 

 

 

 ధైర్యంగా లిప్ లాక్ సీన్లలో నటించి... కొత్త ట్రెండ్ సృష్టించింది అనే చెప్పాలి. విజయ్ దేవరకొండ తో డీప్ లిప్ లాక్ లతో టాలీవుడ్ ని ఒక్కసారిగా షేక్  చేసింది షాలిని  పాండే . అయితే ఎంతో ధైర్యం చేసి అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ సీన్లలో నటించినప్పటికీ అది ఈ అమ్మడు కెరీర్ కి అంతగా కలిసి రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోతే శాలిని పాండే కు మాత్రం అవకాశాలు కరువయ్యాయి. అంత  ధైర్యం చేసి లిప్ లాక్ చేసిన ఆమె కెరీర్ మాత్రం సెట్ అవ్వలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: