సినిమాల్లో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలకు లిప్ కిస్ అవసరమవుతుంది. సినిమాను వృత్తిగా, బాధ్యతగా చూసే కొందరు హీరోయిన్లు ఇందుకు వెనుకాడరు. కొందరు ఇదే నిబద్ధతతో ఉన్నా లిప్ కిస్ లను ఎంకరేజ్ చేయరు. అలా చాలా మంది హీరోయిన్లు పలు అవకాశాలు వదులుకున్నారు కూడా. తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన త్రిష సన్నివేశం ప్రకారం లిప్ అవసరమైతే వెనుకాడలేదు. అలా ఆమె తెలుగు సినిమాలో లిప్ కిస్ కు యాక్సెప్ట్ చేసి చేసిన సినిమా తీన్ మార్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ఆ సినిమా 2011లో వచ్చింది.

 

 

ఇందులో పవన్ కల్యాణ్, త్రిష ఇద్దరూ ఆధునిక భావాలున్న పాత్రల్లో నటించారు. విదేశాల్లో ఉంటూ అక్కడి కల్చర్, నేచర్ ను ఫాలో అయ్యే పాత్రలు అవి. ఓ సన్నివేశంలో ఇద్దరి మధ్య పరిచయంలో ముద్దు సీన్ అవసరమవుతుంది. ఇక్కడ త్రిష ఆ ప్రతిపాదనకు ఏమాత్రం అడ్డు చెప్పలేదు. దీంతో పవన్త్రిష మధ్య లిప్ కిస్ సీన్ చేయించాడు దర్శకుడు జయంత్ సి పరాన్జీ. ఆ సన్నివేశం తర్వాత సినిమాలో వారి పాత్రలకు వారధిలా నిలుస్తుంది. ఇలాంటి సన్నివేశాల్లో ముద్దు సీన్లకు వ్యతిరేకం అనకుండా ఈ సీన్ చుసిన త్రిషను అభినందించాల్సిందే.

IHG

 

పైగా.. ఓ ఇంటర్వ్యూలో తన రియల్ లైఫ్ స్టైల్ కు ఆ పాత్ర దగ్గరగా ఉందని చెప్పుకొచ్చింది కూడా. మహేశ్ తో చేసిన అతడులో కూడా పాత్రకు తగ్గట్టుగా ముద్దు సీన్ చేసింది త్రిష. తీన్ మార్ స్థాయిలో కాకపోయినా మహేశ్త్రిష మధ్య కూడా అలా వచ్చిపోయే సన్నివేశం ఆకట్టుకుంటుంది. త్రిష ఇటువంటి ముద్దు సీన్లకు సన్నివేశం డిమాండ్ చేస్తే కాదనకపోవడం విశేషం. ఆ సన్నివేశాలు ఆ సినిమాలకు ఉపయోగపడ్డాయి కూడా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: