చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా  వైరస్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా హీరోలు అనిపించుకుంటున్నారు. తాజాగా ఓ విలన్ హీరో అనిపించుకున్నాడు. బాలీవుడ్ నటుడు అయిన సోను సూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నాడు. 

 

 

 కరోనా క్లిష్ట పరిస్థితుల్లో మొదటి నుంచి ఎంతో మందికి సహాయం చేస్తూ వస్తున్నారు సోను సూద్. మొదట్లో కరోనా  పేషెంట్లకు వైద్యం అందించే డాక్టర్లకు బస చేసేందుకు తన హోటల్ వాడుకోవాలంటూ  చెప్పడం... మొన్నటికి మొన్న ఉపాధి కోల్పోయి స్వస్థలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కూలీల కు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం... ఇలా ఎన్నో చర్యలు చేపట్టి తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు . తాజాగా మరోసారి తన పెద్దమనసు  చాటారు సోను సూద్. 

 

 

 తాజాగా ముంబైలో వుంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు పంపించేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నారు సోనుసూద్ . దీంతో మే 15వ తేదీన ముంబై నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వలస కార్మికులను వారి గ్రామాలకు  పంపించారు. ప్రయాణంలో వలస కూలీల అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు సోనూసూద్. జీవనోపాధి కరువై కుటుంబ పోషణ భారమై ఎంతో అల్లాడిపోతున్న వలస కూలీలను చూస్తే తన హృదయం ద్రవించింది అని అందుకే వాళ్లకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు సోనూసూద్.

మరింత సమాచారం తెలుసుకోండి: