తెలుగు చిత్ర పరిశ్రమలో కాంట్రవర్సీ కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్. కొన్ని కొన్ని సార్లు తన మాటలతో అందరినీ కడుపుబ్బ నవ్వించే బండ్ల గణేష్ కొన్ని కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలకు గురి అవుతూ ఉంటాడు. ఇప్పటికే ఎన్నోసార్లు ఎంతో మంది సినీ ప్రముఖులపై సంచలన వ్యాఖ్యలు చేసి ఎన్నోసార్లు  విమర్శల పాలయ్యాడు బండ్ల గణేష్. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్  మహేష్ బాబు  న్యూ లుక్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచి  హాట్ టాపిక్ గా మారిపోయాడు. 

 

 

 ప్రస్తుతం లాక్ డౌన్  నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ లన్ని ఆగిపోవడం తో ఎప్పుడు బిజీ బిజీగా ఉన్న మహేష్ బాబు ప్రస్తుతం తన కొడుకు గౌతం,  కూతురు సితార తో సమయం గడుపుతూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కు సంబంధించిన ఒక కొత్త లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేష్ సతీమణి నమ్రత. 

 

 

 ఇంకేముంది ఈ పిక్  కాస్త నెటిజన్లను బాగా ఆకర్షించి వైరల్ గా మారిపోయింది. ఈ కొత్త ఫోటోలు మహేష్ బాబు కొత్త లుక్ తో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నాడు  అయితే తాజాగా ఈ ఫోటో పై బండ్ల గణేష్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ సార్ మీరు హాలీవుడ్ సూపర్ స్టార్ లా ఉన్నారు అంటూ.. సోషల్  మీడియా వేదికగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫోటో ని ట్యాగ్  చేస్తూ వ్యాఖ్యలు చేశారు బండ్ల గణేష్.ఇంకేముంది హాలీవుడ్ సూపర్ స్టార్  అనేసరికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. బండ్ల గణేష్ ని తెగ పొగిడేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: