కరోనా దెబ్బకు కుదేలైన వ్యవస్థల్లో సెలూన్లు కూడా ఉన్నాయి. ప్రతి వ్యక్తికి హెయిర్ కటింగ్ ఎంత ఇంపార్టెంటో, హెయిర్ కట్ చేసుకోకపోతే ఇబ్బందేంటో ఈ లాక్ డౌన్ కళ్లకు కట్టినట్టు చూపించింది. చాలామంది పెరిగిన జుట్టును ఉంచుకోలేక ఇళ్లలోనే స్వంతంగా హెయిర్ కట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా ఇంటర్నెట్ లో హల్ చల్ చేశాయి. ఇప్పుడు టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ కూడా ఇందుకు మినహాయింపు కాలేదు. తన తండ్రికి హెయిర్ కట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.

 

 

సందీప్ కిషన్ తన చెల్లెలితో కలిసి తండ్రికి హెయిర్ కట్ చేశాడు. వచ్చినంతలో హెయిర్ కట్ చేసి తండ్రికి కాస్త రిలీఫ్ ఇచ్చారు. పిల్లలు చేసిన హెయిర్ కట్ కు సందీప్ తండ్రి కూడా హ్యాపీ ఫీల్ అయినట్టు ఆయన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ద్వారా తెలుస్తోంది. మరి సందీప్ కిషన్ హీరో కాబట్టి ఆయన ఇంట్లో ప్రయోగం చేస్తాడని చెప్పలేం. హీరో కాబట్టి సందీప్ కు సెలూన్లు ఓపెన్ కావాల్సిందే. సినిమా వాళ్లకు హెయిర్ స్టైల్ ఫ్యాషన్లు ముఖ్యం కాబట్టి తప్పదు. ఏ చిన్న ఆర్టిస్ట్ అయినా హెయిర్ కట్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.

 

 

పెరిగిన జుట్టుతో మగవాళ్లు పడుతున్న ఇబ్బందుల గురించి ఎన్నో పత్రికల్లో కూడా పలు కామెడీ కార్టూన్లు వచ్చాయి. ఇన్నాళ్లూ జుట్టు పెరిగిందని మాత్రమే సెలూన్లకు వెళ్లేవారు కానీ పెరిగిన జుట్టు వల్ల ఇబ్బంది మాత్రం ఎవరికీ ఆలోచన కూడా వచ్చేది కాదు. కానీ లాక్ డౌన్ అన్ని పరిస్థితులను వివరించినట్టే సెలూన్ ప్రాముఖ్యతను కూడా చూపించింది. సెలూన్లు తెరిచేందుకు త్వరలో అనుమతులిస్తామని ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: