ఎస్ ఎస్ థమన్. మెల్లగా టాలీవుడ్లోకి వచ్చి సూపర్ డూపర్ హిట్లు కొట్టి ఇపుడు నంబర్ వన్ మ్యుజీషియన్ గా సెటిల్ అయిపోయాడు. థమన్ అంటే యూత్ కి పూనకాలు వచ్చేలా చేసుకున్నాడు. రిథంతో పాటు మంచి మెలోడీకి కూడా థమన్ ప్రాధాన్యత ఇస్తూ ఆల్ సెక్షన్స్ ఫావరేట్ మ్యూజీషియన్ అయిపోయాడు.

 

ఇపుడు థమన్ని ఎవరూ మామూలుగా చూడడంలేదు. అల వైకుంఠపురంలో నుంచి దిగి వచ్చిన అపర గంధర్వుడిగా చూస్తున్నారు. థమన్ సైతం తన సక్సెస్ ని కంటిన్యూ చేయడానికే ఆరాటపడుతున్నాడు. మరింతగా తపించి హిట్స్ మీద హిట్స్ కొడుతున్నాడు. ఇక థమన్ అల వైకుంఠపురంలొ కొత్త చరిత్ర స్రుష్టించిన సంగతి తెలిసిందే. 

 

మూవీ వన్ బిలియన్ వ్యూస్ ని దాటేసి ఎక్కడికో వెళ్ళిపోతోంది. అయితే ఈ క్రెడిట్ అంతా దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్ అంటున్నారు థమన్. అలాగే తనతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్ కి కూడా వాటా ఇస్తున్నారు. ఇక గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి కూడా క్రెడిట్ ఇస్తున్నారు. వారంతా ఉండబట్టే ఇంత పెద్ద హిట్టు అంటున్నారు. 

 

ఇక తాను  మ్యూజిక్ చేస్తే అది దర్శకుడి ఆలోచనల నుంచి వస్తుందని చెబుతున్న తమన్  త్రివిక్రం శ్రీనివాస్ తో పనిచేయడం ఒక కల అంటున్నారు. ఆ కలను నెరవేర్చుకున్నందుకు ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఇక ఎన్టీయార్, త్రివిక్రం మూవీ లో మ్యూజిక్ ని కూడా అదిరిపోయే రేంజిలో హిట్ చేయాలని మంచి కసి మీద ఉన్నారు థమన్.

 

థమన్ చేతిలో ఇపుడు పవన్ వకీల్ సాబ్ తో పాటు, బాలయ్య బోయపాటి హ్యాట్రిక్  మూవీ వంటివెన్నో ఉన్నాయి. అదే విధంగా మిడిల్ రేంజి హీరోల సినిమాలకు కూడా మ్యూజిక్ ఇస్తున్న థమన్  వరసగా ఈ ఏడాది కూడా మంచి ఆల్బమ్స్ ఇవ్వడానికి రెడీ అయిపోతున్నాడు. ఇన్ని చేస్తున్న తమన్ తన రెమ్యునరేషన్ మాత్రం ఎంతో చెప్పడంలేదు, తనకు ఎంత ఇవ్వాలో నిర్మాతలకు తెలుసు అంటున్నాడు. సో. థమన్ ఆ సీక్రెట్ మాత్రం చెప్పడన్న మాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: