లాక్ డౌన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది. సినిమా బిజినెస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకెంత కాలం పడుతుంది అనేది ఎవరికీ తెలియడం లేదు. మళ్లీ ఇండస్ట్రీ కుదుటపడటానికి ఎంత టైమ్ తీసుకుంటుంది అనేది క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. దీనికి తోడు లాక్ డౌన్ తర్వాత మునుపటిలా భారీ సినిమాలు తీస్తారా అనే డౌట్స్ కూడా రైజ్ అవుతున్నాయి. 


బాలీవుడ్ లో ఇప్పుడు బ్రహ్మాస్త్ర షంషేర లాంటి భారీ సినిమాలు రూపొందుతున్నాయి. పీరియాడికల్ డ్రామాస్ కూడా సెట్స్ లో ఉన్నాయి. అయితే ఆఫ్టర్ లాక్ డౌన్ ఇలాంటి భారీ సినిమాలు వస్తాయా.. అంటే కొంచెం కష్టమే అంటున్నారు బాలీవుడ్ జనాలు. ఎందుకంటే ఈ మధ్య భారీ స్టార్ కాస్టింగ్ తో వచ్చిన బిగ్ బడ్జెట్ మూవీస్ నిర్మాతలను తీవ్రంగా నిరాశపరిచాయి. కోట్లలో నష్టాలు తెచ్చాయి. దీంతో ఇకముందు నిర్మాతలు భారీ డెసిషన్లు తీసుకోవడానికి వెనకడుకు వేస్తారనే ప్రచారం జరుగుతోంది. 

 

అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన భారీ పీరియాడికల్ మూవీ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్. మొదటి రోజే 50కోట్ల వరకు కలెక్ట్ చేసిన ఈ సినిమా తర్వాతి రోజే అందులో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయింది. నిర్మాతలు 200కోట్లకు పైగా బడ్జెట్ తో భారీగా నిర్మించిన ఈ చిత్రం వాళ్ల అంచనాలను అందుకోలేకపోయింది. 

 

షారుఖ్ ఖాన్ చాలా శ్రమపడి, సొంత నిర్మాణంలో రెండు వందల కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా జీరో. షారుఖ్ మరగుజ్జుగా నటించిన ఈ మూవీలో అనుష్క శర్మ, కత్రీన కైఫ్ హీరోయిన్లుగా చేశారు. అయితే టాప్ స్టార్స్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడింది. థియేట్రికల్ రన్ తో ఈ మూవీతో 186కోట్ల వరకే కలెక్ట్ చేసింది. 


కరణ్ జోహార్ సినిమాల్లో స్టార్ కాస్టింగ్ భారీగా ఉంటుంది. ఇలా ధర్మ ప్రొడక్షన్స్ లో సంజయ్ దత్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, ఆలియా భట్, ఆదిత్యరాయ్ కపూర్, సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా కళంక్. 150కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కిన ఈ పీరియాడికల్ డ్రామా 80కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. 


స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కైట్స్. 125కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కిన ఈ సినిమాలో మెక్సికన్ బ్యూటీ బార్బరా మోరీ హీరోయిన్ గా మెరిసింది. అయితే స్టార్ కాస్టింగ్ తో స్ట్రాంగ్ గా కనిపించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం చాలా వీక్ అయింది. నిర్మాత కలలను నిండాముంచేసింది. 


కథ కరెక్ట్ గా లేకుండా కాంబినేషన్ ను నమ్ముకుంటే బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పదు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా.. టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఉన్నా.. టాప్ స్టార్లు బరిలో దిగినా కథ అనే ఆయుధం లేకుండా బాక్సాఫీస్ యుద్ధం గెలవలేరు. ఈ మధ్య బాలీవుడ్ స్టార్లు ఈ మాటని చాలా సీనియర్స్ గా ప్రూవ్ చేశారు. 


లాక్ డౌన్ తో ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోయింది. నిర్మాతల బ్యాంక్ బ్యాలెన్సులు తరిగిపోతున్నాయి. పైగా ఇలాంటి భారీ డిజాస్టర్లు చూసిన తర్వాత ప్రొడ్యూసర్లు కూడా సేఫ్ గేమ్ కే ప్రియారిటీ ఇచ్చే అవకాశముందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మీడియం రేంజ్ సినిమాలు తీయడానికి చాలామంది నిర్మాతలు మొగ్గుచూపే అవకాశముందని.. కొన్నాళ్ల పాటు భారీ బడ్జెట్ వైపు వెళ్లేందుకు సాహసించరని మార్కెట్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: