ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ గ్రౌండ్ లో దిగితే ఏ రేంజ్ లో విరుచుకుపడతాడో.. ఏ విధంగా వీరబాదుడు బాదుతూ విధ్వంసం సృష్టిస్తాడో మనందరికీ తెలిసిందే. ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ గా వ్యవహరిస్తున్న వార్నర్‌ దెబ్బకి స్టేడియాలే చిన్నబోయిన సందర్భాలు మనం చాలానే చూసాం. ఇప్పుడు వార్నర్ అదే జోష్‌ ను టిక్‌ టాక్‌ లో కూడా చూపిస్తున్నాడు. కరోనా లాక్‌ డౌన్‌ తో ఇంటికే పరిమితమైన ఈ విధ్వంసకర బ్యాట్స్‌మన్ సోషల్ మీడియాతో కాలక్షేపం చేస్తున్నాడు. టిక్‌ టాక్‌ లోకి అడుగుపెట్టి వరుస వీడియోలతో ఫ్యాన్స్‌ ను ఖుషీ చేస్తున్నాడు. తెలుగు తమిళ పాటలకు డ్యాన్స్‌ చేస్తూ రోజుకో వీడియోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇంతకముందు తెలుగు సూపర్ హిట్ 'అల వైకుంఠపురంలో' సినిమాలోని 'బుట్టబొమ్మ' సాంగ్ కు సతీమణి క్యాండీస్‌ మరియు తన కూతురితో కలిసి స్టెప్పులేసాడు. దీనికి అల్లు అర్జున్ ప్రశంసలతో పాటు తెలుగు సినీ అభిమానుల మనసును దోచుకున్నాడు. ఆ తర్వాత కమల్ హాసన్ సాంగ్‌ 'సన్న జాజి పడక' మ్యూజిక్ కి కూతురుతో కలిసి కాలు కదిపారు వార్నర్ దంపతులు.

 

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోని డైలాగ్ చెప్పి ఇరగదీసాడు. 'పోకిరి' సినిమాలో మహేష్ చెప్పిన 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అంటూ టిక్ టాక్ చేసాడు. 'రాములో రాములా' పాటకు తన సతీమణితో కలిసి డ్యాన్స్‌ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. నిన్న 'అమరేంద్ర బాహుబలి అను నేను..’ అనే ప్రభాస్ డైలాగ్‌ చెప్పి మురిపించాడు. ఇలా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ రోజుకొక టిక్‌ టాక్‌ వీడియోతో అభిమానులను అలరిస్తున్నాడు. ఇప్పుడు లేటెస్టుగా వార్నర్ మరో వీడియోతో ముందుకొచ్చాడు. ఇలా రోజుకొక వీడియోతో ఫ్యాన్స్ కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించడంతో పాటుగా తన టాలెంట్ ని కూడా చూపిస్తున్నాడు. 

 

తాజాగా డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా ఎవర్ గ్రీన్ 'ముక్కాలా ముక్కాబుల' సాంగ్ కి వార్నర్ తన భార్య కాండీస్ తో కలిసి డాన్స్ చేశాడు. స్ట్రీట్ డాన్సర్ మూవీ కోసం 'ముక్కాల ముక్కాబుల' సాంగ్ ని రీమిక్స్ చేయగా ఆ పాటకు డేవిడ్ వార్నర్ స్టెప్పులు చేసి ఆకట్టుకున్నారు. 'మా ఇద్దరిలో బెటర్ డ్యాన్సర్ ఎవరో చెప్పండి' అంటూ ఓ క్వశ్చన్‌ విసిరాడు. ప్ర‌స్తుతం డేవిడ్ వార్నర్ చేసిన ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. కాగా తమ అభిమాన హీరోలకు సంబంధించిన పాటలకు డైలాగ్‌ లకు టిక్‌ టాక్‌ చేయాలని ఫ్యాన్స్ వార్నర్ ని డిమాండ్‌ చేస్తున్నారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Who was better @candywarner1 and I or @theshilpashetty 😂😂 #theoriginals @prabhudevaofficial

A post shared by David Warner (@davidwarner31) on

మరింత సమాచారం తెలుసుకోండి: