IHG

ప్రస్తుతం లాక్ డౌన్ ఎత్తివేస్తే తాను ఏఏ పనులు చేయాలో ముందు గా ఓ లిస్ట్ తోపాటు టైం టేబుల్ ను రెడీ చేసుకున్నట్టుంది పూజ హెగ్డే. లాక్ డౌన్ విధించి ఇప్పటివరకు రెండు నెలలు కావస్తుండగా అందరూ తమ ఇళ్లలో ఉంటున్నారు. ఈ రెండునెలల సుదీర్ఘ కాలంలో ఇంట్లో బోరుకొట్టిన ఈ ముద్దుగుమ్మ  లాక్ డాన్ తరువాత ఏమేమి చేయాలో పెద్ద లిస్ట్ తయారు చేసుకుంది. ముందుగా కేరళలోని బెకల్‌ బీచ్‌కి వెళతా అంటోంది. ఎందుకంటే ఎలాగోలా బయటిదేశాలకు వెళ్లే పనిలేదు కాబట్టి కనీసం కేరళలోని బెకల్‌ బీచ్ లో బికినీ లో సరదాగా ఈత కొట్టాలని ఉందని. ఎందుకంటె షూటింగ్ లేక ఇంట్లోనే ఉంటూ రోజు  పైజామాలు వేసుకొని కాస్తబోరు కొట్టింది అందుకే బీచ్ కి వెళ్లి బికినీ వేస్తానంటోంది.

IHG

చిన్ననాటి ఫ్రెండ్స్ ని ఈ లాక్ డౌన్ లో చాలా మిస్ అయ్యాను సో వాళ్ళను కలవాలని ఉంది అదేవిధంగా ముంబయ్‌లోని అంధేరిలో నా బెస్ట్‌ ఫ్రెండ్‌ ఉంటుంది. తననూ చాలా రోజుల నుంచి కలవడం కుదరడం లేదు...ఇంకొకటి... తన దగ్గర ఓ కుక్క ఉంటుంది. తన ఇంటికి వెళ్లి వాళ్లిద్దర్నీ కలుస్తా. లాక్ డౌన్ తరువాత ముంబై నుండి హైదరాబాద్ వస్తా ఎందుకంటె షూటింగ్ ని చాలా మిస్ అవుతున్నా. ఆ తరువాత ముందు చెప్పినట్లు కేరళలోని బెకల్‌ బీచ్‌కి వెళతా , బికినీ ధరించి స్విమ్ చేస్తా ఎందుకంటె అక్కడ ఆ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది.గతేడాది కూడా అక్కడకు వెళ్ళాను.

IHG

 

ఆ తరువాత ముంబయ్‌లో గోవా-పోర్చుగీస్‌ ఫుడ్‌ సర్వ్‌ చేసే రెస్టారెంట్‌ ‘ఓ పెడ్రో’ ఉంది ఇందులో  సీ ఫుడ్‌ చాలా బావుంటుంది. ముఖ్యంగా రొయ్యల బల్చో, పోయ్‌ అద్భుతమే. అలాగే, బేరూట్‌ రెస్టారెంట్‌లో డాకా ల్యాంబ్‌, బొటెకోలో ప్లాటర్‌ బావుంటాయి. లాక్‌డౌన్‌ తర్వాత ఆ రెస్టారెంట్స్‌కి వెళ్లి నచ్చినవి తింటా. ప్రస్తుతం నేను ఇంట్లో రకరకాల వంటలను ట్రై చేస్తున్నాను...ఈ సందర్భంగా నాకు అర్థమైందేంటంటే వంటిట్లో సరుకులు అయిపోయాయి కాబట్టి కిరానా సరుకులు షాపింగ్ చేయాలి అదేవిధంగా కొత్త డ్రస్‌లు కొనుక్కోవాలనీ ఉంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌, డెలివరీలు మూసి వేయడంతో షాపింగ్‌ క్రేజీగా ఉంటుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

3 generations of strong women right here. Happy Mother’s Day to my super duper beautiful mother and cutie pie grandmother ❤️ #canttakemyeyesoffher

A post shared by Pooja Hegde (@hegdepooja) on

మరింత సమాచారం తెలుసుకోండి: