‘చక్కనమ్మ చిక్కినా అందమే’.. అనే నానుడి మన హీరోయిన్లకు చక్కగా సరిపోతుంది. త్రిష, శ్రియ.. తరం ఎంటర్ అయ్యాక ఈ నానుడికి మరింత ఇంపార్టెన్స్ వచ్చింది. అంతకుముందు వరకూ హీరోయిన్ అంటే బొద్దుగా కూడా ఉండేవారు. చక్కనమ్మలా చక్కగా కనిపించే మన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నాజూకైన అందం, మంచి ఫిట్ నెస్ తో తెలుగులో టాప్ హీరోయిన్ అయింది. సోషల్ మీడియాలో అప్డేట్ గా ఉండే రకుల్ తన లేటెస్ట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ పిక్ లో రకుల్ చాలా అందంగా ఉంది.

 

 

బ్లాక్ అండ్ వైట్ లో రిలీజ్ చేసిన ఈ ఫోటోలో అందంతో పాటు సెక్సీనెస్ కూడా యాడ్ చేసింది రకుల్. ఎద అందాలను ఓరగా చూపిస్తూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ చాలా అందంగా ఉంది. చలికాలం ఉదయం వేళల్లో విచ్చుకుంటున్న గులాబీ పువ్వులా సింపుల్ గా నవ్వుతోంది. ‘ఆనందంగా ఉన్న సమయంలో ఇలా ఉంటాం’ అని అర్ధం వచ్చేలా ఓ క్యాప్షన్ కూడా ఇచ్చుకుంది. ఈ పిక్ చూసిన రకుల్ ఫ్యాన్స్ ఇంత అందం ఎలా సాధ్యమైంది రకుల్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. రకుల్ అందానికి ఫిదా అయిపోతున్నారు.

 

 

ప్రస్తుతం ఓ హీరోయిన్ ఎంత నాజూకుగా ఉంటే అన్ని సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి. రకుల్ తెలుగులో దాదాపు ప్రతి స్టార్ హీరోతో సినిమాలు చేసింది. ఫ్లాపులు ఇవ్వడంతో రేస్ లో వెనుకబడింది. ప్రస్తుతం తమిళ్ లో శంకర్ దర్శకత్వంలో భారతీయుడు2, అయలాన్, హిందీలో అటాక్ సినిమాలు చేస్తోంది. తెలుగులో ఒక్క అవకాశం వస్తే తానేంటో మళ్లీ నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉంది. రకుల్ పోస్ట్ చేసిన పిక్ చూస్తే తన అందానికి తెలుగులో అవకాశాలు వచ్చేలానే ఉన్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Live in the freshness of the present moment ❤️ #happysunday

A post shared by rakul Singh (@rakulpreet) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: