దేశ వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ ని మరోసారి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ లో కొన్ని మినహాయింపు లు ఇచ్చినా సరే సినిమాలకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. జనాలు అందరూ ఒక చోటకు వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో మినహాయింపు లు ఇచ్చేది లేదని కేంద్రం తన మార్గదర్శకాలలో స్పష్టంగా పేర్కొంది. లాక్ డౌన్ ని కొన్ని ప్రాంతాల్లో కతినంగా అమలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు నిర్మాతల విషయంలో సినీ కార్మికుల విషయంలో చిరంజీవి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

 

ఆయన ఇప్పటికే మెగా హీరోలు అందరిని కూడా కలిసి ఒకసారి కొన్ని విషయాలను చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. నిర్మాతల దగ్గర ఎవరు కూడా పారితోషికం తీసుకోవద్దు అని నిర్మాతలకు అండగా ఉండాలి అని సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇక చిన్న చిన్న నటులను కూడా మీరు ఆదుకోవాలని లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు కూడా వారికి ఏదోక విధంగా సహాయం చెయ్యాలని వారికి సూచనలు చేసినట్టు సమాచారం. అందరూ మన తో కలిసి ప్రయాణం చెయ్యాల్సిన వారు అని కాబట్టి వారికి మనం భరోసా ఇవ్వాలి అని ఆయన సూచనలు చేసినట్టు తెలుస్తుంది. 

 

చిన్న చిన్న వాళ్లకు అందరికి అండగా ఉంటే భవిష్యత్తు లో వాళ్ళ ద్వారా మనం బాగుంటాం అని కాబట్టి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీకు తోచిన సహాయం చేయడం మంచిది అని ఆయన వారికి సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ తో కూడా చిరంజీవి ఇదే విషయం గురించి ఇప్పటికే మాట్లాడినట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు నిజం అనేది ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: