దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఫిక్షన్ స్టోరీతో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం ల పాత్రలను అద్భుతంగా వెండితెరమీద ఆవిష్కరించబోతున్నారు రాజమౌళి. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. 

 

ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ మోషన్ టీజర్, రాం చరణ్ వీడియో టీజర్ తో సినిమా మీద ఒక కొన్ని అంచనాలు వచ్చేలా చేశారు. రాం చరణ్ బర్త్ డేకి రాజమౌళి ఇచ్చిన గిఫ్ట్ మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి మంచి కిక్ ఇచ్చింది. ఎన్.టి.ఆర్ వాయిస్ చరణ్ విజువల్ ఎంతో హైలెట్ గా నిలిచాయి. దాంతో అప్పటి నుంచి తారక్ ని ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అన్న కుతూహలం మొదలైంది. ఇది ఒక్క తారక్ అభిమానులకే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులకి ఉన్న క్యూరియాసిటి. 

 

అయితే అది ఈ నెల 20 తో తీరబోతుందని తాజా సమాచారం. వాస్తవంగా లాక్ డౌన్ కారణంగా మే 20 న ఎన్.టి.ఆర్ బర్త్ డేకి రాజమౌళి ఇస్తాడనుకున్న గిఫ్ట్ ఉండదని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. కాని ఖచ్చితంగా జక్కన్న తారక్ కి అదిరిపోయో బర్త్ డే గిఫ్ట్ ఇవ్వబోతున్నాడట. ఇదే గిఫ్ట్ తారక్ తన ఫ్యాన్స్ కి, ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాడని తాజా సమాచారం.

 

ఆర్.ఆర్.ఆర్ లో తారక్ పోషిస్తున్న కొమరం భీం పాత్రని రివీల్ చేస్తూ తారక్ కి బర్త్ డే గిఫ్ట్ ఇవ్వడానికి సర్వం సిద్దం అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ గిఫ్ట్ తో ఆర్.ఆర్.ఆర్ ఎలా ఉంటుందో కంప్లీట్ గా తెలియబోతుందట. అంతేకాదు ఇదే రోజు తారక్ మరో గిఫ్ట్ కూడా ఫ్యాన్స్ కి ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. అదే త్రివిక్రం, తారక్ ల అయినను పోయిరావలె హస్తినకు సినిమా నుండి అని సమాచారం.   

మరింత సమాచారం తెలుసుకోండి: