టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గానూ ఎందరో దర్శక నిర్మాతలు ముందు నుంచి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. టాలీవుడ్ లో అతనికి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలుసు. ఇప్పుడు అతను ఆర్ఆర్ఆర్ అనే సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలకు సిద్దమవుతుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు తన తర్వాతి సినిమాల గురించి ఎక్కువగా చర్చిస్తున్నాడు ఎన్టీఆర్. ఖాళీ గా ఉన్న నేపధ్యంలో అతని ఇప్పుడు తన సినిమాల మీద ఫోకస్ చేసాడు. 

 

వెంటనే సినిమాలను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే విధంగా రెండు మూడేళ్ళకు సంబంధించిన కథలను వింటున్నాడు అని సమాచారం. తాజాగా అతను హరీష్ శంకర్ చెప్పిన ఒక కథ విన్నాడు అని సమాచారం. హరీష్ శంకర్ తో గతంలో ఒక సినిమా చేసాడు ఎన్టీఆర్. ఆ సినిమా అప్పుడు ఫ్లాప్ అయింది. ఇప్పుడు అక్కడి నుంచి కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గానూ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా సరే ప్రయత్నాలు చేస్తున్న కుదరడం లేదు. ఇటీవల ఎన్టీఆర్ కి ఒక మంచి కథ ఉంది అని చెప్పాడట. ఎన్టీఆర్ ఫోన్ లో కథ కూడా విన్నాడు అని సమాచారం. 

 

వీడియో కాల్ ద్వారా కథ విన్నాడు అని కాని ఆ కథ నచ్చలేదు అని తెలుస్తుంది. ఆ కథను వెంటనే అతను పవన్ కళ్యాణ్ కి వినిపించగా పవన్ ఆ కథను ఓకే చేసాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది పవన్ ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ అనే సినిమా లో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: