రమ్యకృష్ణ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి తో సహా దాదాపు అందరితోను బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది. అంతేకాదు చాలా మంది హీరోయిన్స్ కి గట్టీ పోటీ కూడా ఇచ్చింది. అంతేకాదు రజనీకాంత్ నటించిన నరసింహ సినిమాలో నీలాంబరిగా పోషించిన పాత్రతో తన సత్తా ఎంతటిదో సౌత్ సినిమా ఇండస్ట్రీలో చాటి చెప్పింది. ఏకంగా రజనీకాంత్ ని ఢీ కొట్టే పాత్రలో అద్భుతంగా నటించి కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ నీలాంబరి అనిపించుకుంది.

 

ఇక ఆ తర్వాత మళ్ళీ బాహుబలి సినిమాతో మళ్ళీ రమ్యకృష్ణ రేంజ్ అమాంతం మారిపోయింది. ఆ సినిమాలో పోషించిన శివగామి పాత్ర జీవితాంతం గుర్తుండిపోవడం తో పాటు ఆ తర్వాత అద్భుతమైన అవకాశాలు చేజిక్కించుకునేలా అవకాశం దక్కింది. ప్రభాస్, రానా లతో పాటు సమానంగా రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకి పాపులారిటి దక్కడం గొప్ప విశేషం. అయితే అవకాశాలు ఎక్కువగా సినిమాలకంటే వెబ్ సిరీస్ లలో వస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.   

 

కరోనా మహమ్మారితో ప్రస్తుతం జనాలు సినిమా కోసం థియేటర్స్ కే వెళ్ళాలి అన్న ఆలోచన లేదనే చెప్పాలి. దీంతో లాక్ డౌన్ లో డిజిటల్ ప్లాట్ ఫాంస్ కి విపరీతంగా ఆదరణ దక్కుతోంది. సేఫ్ గా ఇంట్లోనే ఉంటూ నచ్చిన సినిమాలని చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ దానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఇరవై నుంచి అరవై ఏళ్ళ వరకు  అందరూ ఇదే ధోరణిలోకి వచ్చేశారు. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా వెబ్ సిరీస్ లను నిర్మించాలని ప్రణాళికలు వేస్తున్నారు. 

 

అయితే ఈ విషయంలో అందరికంటే ముందే శివగామి‌ రమ్యకృష్ణ గతేడాదే క్వీన్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అయింది. ఈ క్రమంలో రమ్యకృష్ణ వెబ్ సిరీస్ ల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. ‘వెబ్‌ సిరీస్‌ ల వల్ల నటులకు వెరైటీ రోల్స్‌ చేసే అవకాశం లభిస్తుంది. ఈ కరోనా కారణంగా వెబ్‌ సిరీస్‌ కి వాటిలో నటించే వాళ్ళకి బాగా డిమాండ్‌ పెరుగుతుందని తెలిపారు.

 

అంతేకాదు వెబ్‌ సిరీస్‌ కి కూడా సినిమా స్థాయిలోనే ఆదరణ వస్తుందని అన్నారు. ఇక తనకి ఎక్కువగా ఇంటర్నేషనల్‌ వెబ్‌ సిరీస్‌ ఆఫర్లు బాగా వస్తున్నాయని రమ్యకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంలో స్టార్ హీరోయిన్స్ కంటే రమ్యకృష్ణ ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంటూ గట్టి పోటీ ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: