గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి  స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈసినిమా తరువాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండా పూరి ,యంగ్ హీరో విజయ్ దేవరకొండతో  సినిమాను మొదలుపెట్టాడు. ఇటీవలే ఈసినిమా సెట్స్ మీదకు 40 శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.  ఇక  ఈచిత్రానికి ఫైటర్ అనే టైటిల్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి కానీ ఫైటర్ కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే నని అసలు టైటిల్ అదిరిపోతుందని తాజాగా ఈసినిమా నిర్మాతల్లో ఒకరైన ఛార్మి వెల్లడించింది అలాగే సరైన సమయానికి టైటిల్ ను విడుదలచేస్తామని ఆమె ప్రకటించింది.
 
బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సిక్స్ ప్యాక్ లో కనిపించనుండగా అతనికి జోడిగా అనన్య పాండే  నటిస్తుంది. వీరితోపాటు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ , సీనియర్ నటి రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. తెలుగుతోపాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి ఛార్మి , పూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుండగా అనన్య టాలీవుడ్ లోకి అడుగుపెట్టనుంది.  
 
ఇదిలావుంటే గత ఏడాది డియర్ కామ్రేడ్ తో డిజాస్టర్ ను ఖాతాలో వేసుకున్న విజయ్ తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ తో మరో డిజాస్టర్ ను చవిచూశాడు దాంతో ఫైటర్ పై విజయ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత విజయ్, మోహన్ కృష్ణ ఇంద్రగంటి తో అలాగే శివ నిర్వాణ తో సినిమాలు చేయనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: