దేశంలో వ‌ల‌స కూలీలు, కార్మికుల దుర్భ‌ర‌మైన జీవితాల‌ను క‌న్నీళ్లు పెట్టిస్తున్నాయి. లాక్‌డౌన్‌వ‌ల్ల ఎక్క‌డిక‌క్క‌డ చిక్కుకుపోయిన కార్మికులు సొంతూళ్లు వెళ్లేందుకు నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. సొంతూళ్ల‌కు వెళ్తున్న వాళ్ల వెంట తీసుకెళ్లే మూట‌లను ప‌రిశీలిస్తే.. గుండెల‌విసిపోయే దృశ్యాలు... వారి వెంట కొన్ని బ‌ట్ట‌లు, ప‌ని సామాగ్రిని వెంట తీసుకునిపోతున్నారు. ఈ వీడియోను ప్ర‌ముఖ న‌టుడు సోనూ సూద్ భావోద్వేగానికి గుర‌య్యారు. వారిని ఆదుకోవ‌డంలో మ‌నం మనుషులుగ విఫలమయ్యామంటూ ట్వీట్ చేశారు. నిజానికి.. ఇంత‌కు ముందు కూడా సోనూ సూద్ వ‌ల‌స కార్మికుల కోసం ఎంతో సాయం చేశారు. ముంబయిలోని తన హోటల్‌ను కరోనా వ్యాధిగ్రస్తులకు  సేవలందిస్తున్న వైద్యులకు వసతి గృహంగా కేటాయించాడు. దాంతో పాటు ముంబయిలోని అంధేరి, జోగేశ్వరి,  జుహూ, బాంద్రాతో పాటు కొన్ని మురికివాడల్లో ప్రతిరోజు 45 వేల మందికి భోజనాన్ని అందించారు.

 

ఇటీవ‌ల వ‌ల‌స కూలీలు ప‌డుతున్న ఆవేద‌న చూసిన సోనూ మ‌హా‌రాష్ట్ర‌, క‌ర్ణాట‌క ప్ర‌భుత్వాల నుండి ప్ర‌త్యేక అనుమ‌తులు తీసుకొని ప‌ది బ‌స్సులు ఏర్పాటు చేశారు. థానే, గుల్భ‌ర్గా నుండి వ‌ల‌స కూలీల‌ని త‌ర‌లించేందుకు ఈ బ‌స్సులని ఏర్పాటు చేసిన‌ట్టు సోనూసూద్‌ చెప్పారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అనుమ‌తి తీసుకొని మే 15న ముంబై నుండి లఖ్‌వ‌నూ,హ‌ర్దోయ్, ప్ర‌తిప్ గ‌ఢ్‌, సిద్ధార్ద్ న‌గ‌ర్,బీహార్, జార్ఖండ్ నుండి పలు న‌గ‌రాలకి ప్ర‌త్యేక బ‌స్సుల‌లో వ‌ల‌స కూలీల‌ని త‌ర‌లించారు. వారికి భోజనంతో పాటు అనేక స‌దుపాయాలు క‌ల్పించారు.ఈ సంద‌ర్భంగా కూడా ఆయ‌న చేసిన ట్వీట్ అంద‌రినీ క‌దిలిస్తోంది. * ప్ర‌స్తుతం వ‌ల‌స కూలీల ప‌రిస్థితి చూసి నా గుండె తరుక్కు పోతుంది. భార్య‌పిల్ల‌ల‌తో క‌లిసి రోడ్ల‌పై న‌డుచుకుంటూ పోతున్న వారిని చూసి నా గుండె త‌రుక్కుపోయింది. అందుకే  ఆఖ‌రు కూలీ త‌న స్వ‌స్థ‌లానికి చేరే వ‌ర‌కు ర‌వాణా సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తాను* అంటూ సోనూ స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు సోనూ సూద్ దారిలోనే మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు న‌డుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: