స్టార్ యాక్ట్రెస్ అయ్యే టాలెంట్ ఉన్నా సరే కొందరు భామలు ఎందుకో సరిగా క్లిక్ ఎవరు. వారి గురించి చెబితే అందులో సలోని కూడా ఉంటుంది. సుమంత్ హీరోగా వచ్చిన ధన 51 సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ మహారాష్ట్ర అమ్మడు ఆ తర్వాత ఒక ఊరిలో సినిమాలో నటించి మెప్పించింది. కెరియర్ దాదాపు ముగిసింది అనుకునే టైం లో రాజమౌళి డైరక్షన్ లో మర్యాద  రామన్న సినిమాలో ఛాన్స్ అందుకుంది సలోని. ఆ సినిమా హిట్ అమ్మడి కెరియర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. పక్కింటి అమ్మాయిగా కనిపించే సలోని తెలుగులో క్లిక్ అవుతుందని అనుకున్నారు. 

 

ఆమె సూపర్ హిట్ సినిమాలు చేయకపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉండేది. ఒక ఊరిలో, చుక్కల్లో చంద్రుడు టైం లో సలోని క్రేజ్ బాగా ఉండేది. అయితే ఆ అర్వాత అవకాశాలు రావట్లేదని సైడ్ రోల్స్ చేస్తూ వచ్చింది. అందుకే ఆమెకు హీరోయిన్ పాత్రలు రాలేదు. వెంకటేష్ బాడీ గార్డ్ సినిమాలో త్రిష స్నేహితురాలిగా నటించింది. ఆ సినిమా హిట్టైన సలోని కెరియర్ కు ఏమాత్రం యూజ్ అవలేదు. 2016లో మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో కనిపించిన సలోని ఆ తర్వాత మళ్ళీ తెలుగులో కనిపించలేదు. 


స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నా సరైన సినిమాల ఎంపిక లేకపోవడం వల్లే సలోని ఇలా కెరియర్ లో వెనుకపడ్డదని తెలుస్తుంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేసినా సరే ఎక్కడ కూడా అమ్మడు స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేదు. దాదాపు తెలుగులో కెరియర్ ముగిసిందని చెప్పొచ్చు. ఏమన్నా ఛాన్స్ వచ్చినా సైడ్ రోల్స్ తప్ప హీరోయిన్ గా మాత్రం కష్టమే అని చెప్పొచ్చు.                 

మరింత సమాచారం తెలుసుకోండి: