ఆర్య లాంటి హిట్టు సినిమా చేసి అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా ఎదిగి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కానీ ఆ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనురాధ మెహతా అలియాస్ అను మెహతా మాత్రం ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయ్యింది. ఆర్యతో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆర్యన్ కాదు తెలుగు ఆడియెన్స్ ను తన లవ్ లో పాడేసుకున్న అను మెహతా ఆ తర్వాత సినిమాల సెలక్షన్స్ లో పొరపాట్లు చేసింది. 


ఆర్య లాంటి హిట్ తర్వాత స్టార్ సినిమాలు చేయలేదు. అవకాశాలు రాలేదో లేక వచ్చినా చేయలేదో తెలియదు కానీ అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్ కలిసి చేసిన నువ్వంటే నాకిష్టం సినిమాలో నటించింది ఈ అమ్మడు. ఆ సినిమా ఫలితం నిరాశపరిచింది. ఆ తర్వాత ఒక కన్నడ సినిమా చేసినా అది పెద్దగా వర్క్ అవుట్ అయినట్టు లేదు. తెలుగులో మహారాజశ్రీ, వేడుక సినిమాలు చేయగా వాటితో కూడా అను మెహతా తన మార్క్ చూపించలేకపోయింది. మోడల్ గా అలరించిన ఈ అమ్మడు హీరోయిన్ గా  18 ఏళ్లలో కేవలం ఐదారు సినిమాలు మాత్రమే చేసి అడ్రెస్ లేకుండా పోయింది. అల్లు అర్జున్ లాంటి హీరోతో సినిమా చేశాక అమ్మడి కెరియర్ పీక్స్ లో ఉంటుందని ఆశించారు కానీ అలా జరుగలేదు. 


స్కిన్ షో, గ్లామర్ షో, లిప్ లాక్స్ వీటన్నిటికీ దూరంగా ఉండాలని భావించి బహుశా సినిమాలు చేయడం మానేసిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆర్య సినిమా తెలుగులో ఒక ట్రెండ్ సెట్టర్ ఆ సినిమాలో హీరోయిన్ గా చేసిన అనుని అందరు గుర్తు పెట్టుకుంటారు. మరి అమ్మడు ప్రస్తుతం ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చినా ఆర్య ఇమేజ్ తో కెరియర్ లాగించేయొచ్చు అని కొందరు సలహా. 

మరింత సమాచారం తెలుసుకోండి: