ప్రస్థుతం నడుస్తున్న రంజాన్ మాసం నియమాలను పాటిస్తూ లాక్ డౌన్ సమయంలో ప్రస్తుతం ఇంటికి పరిమితం అయిన కమెడియన్ అలీరంజాన్ మాసంలో ఆత్మావలోకం చేసుకుంటూ తనకున్న దాంట్లో చాలామంది పేదలకు దానాలు ఇస్తూ తన కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా కాలం గడుపుతున్నాడు. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం ప్రజలను భయపెడుతున్న కరోనా గురించి మాట్లాడుతూ గొప్ప వ్యక్తుల దగ్గర నుండి అతి సామాన్యుడి వరకు బతికితే చాలు అన్న వేదాంతం కరోనా నేర్పింది అని చెపుతూ ప్రకృతి ముందు చేతులుకట్టుకుని నుంచున్న ప్రజలను చూస్తుంటే తనకు ఆశ్చర్యం వేస్తోంది అంటూ కామెంట్స్ చేసాడు.


లాక్ డౌన్ లో అందరికన్నా ఎక్కువగా బాధపడుతుంది గృహిణులు మాత్రమే అని తన భార్య ప్రస్తుతం గిన్నెలు తోవడం దగ్గర నుండి వంట చేయడం వరకు అన్ని పనులు చేస్తూ ఆమె చేతులు కందిపోయాయని అలీ ఈ లాక్ డౌన్ సమయంలో గృహిణులు పడుతున్న కష్టాలను వివరించాడు. ఇక ఇదే సందర్భంలో సినిమా ఆర్టిస్టుల జీవితం గురించి మాట్లాడుతూ చాలామంది సినిమా వారికి రేపటి గురించి ఆలోచన ఉండదని ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు నేడు ఆర్ధికంగా కష్టాలు పడటానికి కారణం వంచకుల నటన అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.


ఎన్నో పాత్రలను చాల అవలీలగా పోషించే ఎందరో నటీనటులు తమ చుట్టూ చేరే చుట్టాలు స్నేహితులు నమ్మించి మోసం చేయడం వల్ల నష్టపోతారని కామెంట్స్ చేసాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎంతో అద్భుతంగా జీవితంలో నటించే వంచకుల నటన ముందు నటీనటుల నటనాప్రతిభ సరిపోదు అంటూ కామెంట్స్ చేసాడు. ఇలా తమ చుట్టూ ఉన్న వంచకుల మాటల వల్ల మోసపోయిన ఎందరో సినిమా కళాకారులు బెంగతో ఆత్మహత్యలు అర్దాంతరపు చావుల పాలైన సంఘటనలు తనకు తెలుసు అంటూ కామెంట్స్ చేసాడు.


ప్రస్తుతం వందల కోట్ల ఆస్థులు కలిగి ఉన్న అలీ కేవలం 10 రూపాయల కోసం పాట్లు పడిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ తన చిన్నతనంలో ఒక రూపాయి సంపాదించడం కూడ కష్టం అయిపోయి తన మిత్రుడి వద్ద ఇస్త్రీ బండి తీసుకుని కేవలం 50 పైసల కోసం ఒక షర్టు లేదా ఒక ప్యాంట్ ఇస్త్రీ చేసిన విషయాలు తనకు గుర్తున్నాయి అంటూ గుర్తుకు చేసుకున్నాడు. ఏవ్యక్తి అయినా మరొకరికి ఎంతోకొంత సహాయం చేస్తేనే దేవుడు మన ప్రార్ధనలను మన్నిస్తాడని అలా చేయకుండా చేసే పూజలు ఉపవాసాలు అన్నీ వ్యర్థం అని అలీ అభిప్రాయపడుతున్నాడు. నిజంగానే అలీ మాటలలో ఎంతో నిజం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: