టాలీవుడ్ లో భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా ఫ్లాప్ అయిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమా ప్రేక్షకులకు ఎక్కలేదో లేక అది ప్రేక్షకులకు నచ్చలేదో గాని ఆ సినిమా మాత్రం చాలా ఫ్లాప్ అవ్వడమే కాదు మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా చెప్తూ ఉంటారు. ఇక ఆ సినిమాలో నటించిన హీరోయిన్ అమృత రావు ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఆ సినిమాలో ఆమె నటన పరంగా కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది. ఆమె అందం ఆమె నవ్వు అన్నీ కూడా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి. 

 

కాని ఆమె తెలుగులో ఎక్కువ రోజులు ఉండలేదు. ఆమెకు వచ్చిన అవకాశాలు ఆమె వాడుకోలేదో లేక ఆమెను స్కిన్ షో చేయమని దర్శక నిర్మాతలు ఇబ్బంది పెట్టారో తెలియదు గాని ఆమె అప్పటి నుంచి కూడా మన తెలుగులో కనపడలేదు. ఆమె బాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలు చేయడానికి చూసినా సరే ఆమెకు అవకాశాలు రాక ఇక సినిమాలకు దూరం గా ఉంది. ఆమెను కమర్షియల్ హీరోయిన్ గా మార్చాలి అని చాలా మంది ప్రయత్నాలు చేసారు అని కాని అది సాధ్యం కాలేదు అని చెప్తూ ఉంటారు. 

 

ఆమెకు పెద్దగా సినిమాల మీద ఆసక్తి ఉండేది కాదని కొందరి ఒత్తిడి తో ఆమె సినిమాలను చేసింది అని కాని ఆమెను కొందరు ఇబ్బంది పెట్టడం తో ఆమె సినిమాల నుంచి వెళ్ళింది అని అంటూ ఉంటారు. కాని మహేష్ తో సినిమా చేయడం తో ఆమె మాత్రం స్టార్ హీరోయిన్ అవుతుంది అని భావించారు కూడా జనాలు. కాని ఆమె మాత్రం ఎక్కువ రోజులు తెలుగులో సినిమాలు చేయలేక ఇబ్బంది పడి వెళ్లిపోయింది అని చెప్పవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: