హ్యాపీడేస్ సినిమాలో నలుగురు హీరోల్లో ఒకడైన నిఖిల్, ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన యువత సినిమా మంచి విజయం అందుకున్నాడు. అయితే యువత అనంతరం వరుస ఫ్లాపులు పలకరించాయి. కానీ సుధీర్ వర్మ దర్శకత్వంలో వచ్చిన స్వామిరారా చిత్రంతో అతడు నిలబడగలిగాడు. అప్పటి నుండి మంచి మంచి కథాంశాలని ఎన్నుకుని విభిన్నమైన పంథాలో వెళ్తున్నాడు. దాన్లో భాగంగానే కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి హిట్లు వచ్చాయి.

 

ఈ మధ్యే పెళ్ళి చేసుకుని ఒకింటివాడైన నిఖిల్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్ ౨, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న  ౧౮ పేజెస్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే కార్తికేయ ఫేమ చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ ౨ చేస్తున్నాడు. ఇంకా షూటింగ్ ప్రారంభించని ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో రిలీజై ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. 

 

కాన్సెప్ట్ వీడియో కొత్తగా అనిపించడంతో సినిమా బాగుంటుందన్న ఆశలు కలుగుతున్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ భారీ ఉండనుందట. సుమారు ౨౫ కోట్లకి పైగానే ఖర్చు అవనుందట. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉండనున్నాయట. అందువల్ల నిఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనుందట. మిడ్ రేంజ్ హీరో అయిన నిఖ్జిల్ మార్కెట్ కి అంతగా ఖర్చు చేయడం కరెక్టేనా అనే వాళ్ళున్నారు. 

 

అదీ గాక ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణ వ్యయాలు తగ్గించుకోవాలని చెబుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో అంతంత బడ్జెట్లో సినిమాలు తీస్తే రికవరీ అవడం కష్టమేమో అని సందేహిస్తున్నారు. అయితే కార్తికేయ ౨ పై నిఖిల్ కి నమ్మకం ఉందట. చందూ మొండేటి ఈ చిత్రాన్ని బాగా తీస్తాడని అనుకుంటున్నాడట. అందువల్ల భారీ బడ్జెట్ అయినా కూడా కార్తికేయ౨ రికవరీ చేయగలదని నమ్ముతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: