తెలుగు ప్రేక్షకులకు బండ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన బండ్ల గణేష్.. ఆ తరవాత స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్ కి వచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. పరమేశ్వరీ ఆర్ట్స్ బ్యానర్ పై పవన్ కళ్యాణ్, రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మొదలైన స్టార్ హీరోలందరితో సినిమాలు నిర్మించాడు. 'గబ్బర్ సింగ్' హిట్ తో ఒక్కసారిగా ఇండస్ట్రీలో బడా ప్రొడ్యూసర్ అయ్యాడని చెప్పవచ్చు. తన సినిమాలతోనే కాకుండా తన మాటలతోటి వ్యవహారశైలి తోటి వార్తల్లో ఉంటూ వస్తున్నాడు బండ్ల గణేష్. ఆలోచించకుండా మనసుకు ఏది తోస్తే అది ముక్కుసూటిగా మాట్లాడుతూ విమర్శలకు గురి అవుతుంటాడు. ఇంతకముందు కూడా ఒక ఇంటర్వ్యూలో నోరు జారి తన పేరు అందరూ బ్లేడ్ గణేష్ అని పిలిచే స్టేజికి తెచ్చుకున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టీవ్ గా ఉంటూ అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటాడు.

 

బండ్ల గణేష్, హరీష్ శంకర్‌ల మధ్య ఏం జరిగిందో తెలియదు గాని సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడిచింది. ‘గబ్బర్‌ సింగ్’ చిత్రయూనిట్‌ ను తలుచుకుంటూ హరీష్ శంకర్ విడుదల చేసిన లెటర్‌లో బండ్ల గణేష్ పేరు లేదు. అక్కడ మొదలైన వార్ బండ్ల గణేష్, హరీష్ శంకర్‌ పై రీమేక్ దర్శకుడు అంటూ.. ‘విస్తరాకు’ ‘ఎంగిలాకు’ అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. కష్టకాలంలో ఉన్న హరీష్‌ కు నేనే అవకాశం ఇచ్చాను అని.. హరీష్ రీమేక్ సినిమాలను మాత్రమే హ్యాండిల్ చేయగలడు.. ఆయన స్ట్రైట్ తెలుగు సినిమా తీసి హిట్ కొడితే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అని చెప్పుకొచ్చాడట. అయితే వాటికి కూడా హరీష్ సమాధానం ఇచ్చారని ప్రముఖ ప్రసార మాధ్యమాలు వెల్లడించాయి. అసలు ‘గబ్బర్‌ సింగ్’ సినిమాకి ముందు నిర్మాత నాగబాబు గారని.. కానీ నాకు అవకాశం పవన్ కల్యాణ్‌ అని తెలిపాడట.

 

దీంతో ''తింటున్నంత సేపు ‘ఇస్తరాకు’ అంటారు.. తిన్నాక ‘ఎంగిలి’ ఆకు అంటారు. అంటే నీతో అవసరం ఉన్నంతసేపు.. వరుసలు కలిపి మాట్లాడతారు.. అవసరం తీరాక లేని మాటలు అంటకడుతారు'' అనే కొటేషన్ పెట్టాడు బండ్ల గణేష్. ఇది ఎవరిని ఉద్దేశించి వేసారో అని నెటిజన్స్ ఆలోచిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇది హరీష్ శంకర్ ని ఉద్దేశించే వేసాడు అని సోషల్ మీడియాలో చర్చింకుంటున్నారు.  కాగా తాజాగా బండ్ల ఓ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ హరీష్ శంకర్ ప్రస్తావన తీసుకువస్తే.. హరీష్ శంకర్ నాకు బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చాడు.. కానీ ఇక పై హరీష్ శంకర్‌ తో సినిమాలు చేయను అంటూ బండ్ల చెప్పుకొచ్చారు. మరి దీనిపై హరీష్ ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: