టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో అన్ని విధాలుగా వార్తల్లో నిలిచిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. చేసిన సినిమాలు అన్నీ కూడా స్టార్ హీరోలతో ఉండటమే కాకుండా ఆమె సినిమాలు అన్నీ కూడా ఒక రేంజ్ దర్శకులతో చేయడం తో ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది అని భావించారు చాలా మంది. ఆమె హవాలో చాలా మంది హీరోయిన్ లు కనపడే అవకాశం లేదని కూడా అనుకున్నారు. అయినా సరే చాలా తక్కువ కాలంలో ఆమె కెరీర్ లో ఇబ్బందులు పడింది. తెలుగు నుంచి దాదాపుగా ఆమె వెళ్లిపోయింది అనే చెప్పుకోవచ్చు. 

 

అయితే దీని వెనుక కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమెకు ఉన్న రాజకీయ పరిచయాలు ఆమెను ఇబ్బంది పెట్టాయి అని కొందరు అంటే ఆమెది ఐరన్ లెగ్ అని మరికొందరు అన్నారు. ఆ మాటలు అనడానికి వాళ్ళు తీసుకున్నవి ఏంటీ అనేది తెలియకపోయినా ఆమెకు బాలీవుడ్ మీద ఉన్న ఆసక్తి గమనించిన కొందరు ఆమెను తెలుగు నుంచి కావాలి అనే పంపించారు అని అంటున్నారు. టాలీవుడ్ లో ఆమెకు స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చినా సరే ఆమె మాత్రం వాటిని నిరూపించుకోవడం లో ఘోరంగా విఫలం అయింది అంటున్నారు. 

 

ఆమె కొందరి తో అనవసరంగా స్నేహం చేసింది అని దీనితో ఆమె తో సినిమాలు చేయడానికి చాలా మంది భయపడ్డారు అని అందుకే ఆమెను పక్కన పెట్టాలి అని అనుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి కూడా. ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంది. అక్కడ ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయని అంటున్నా ఆమె మాత్రం ఏ సినిమాలో కూడా ఈ మధ్య కాలంలో కనపడలేదు. మరి బాలీవుడ్ లో ఉంటుందో లేక తిరిగి టాలీవుడ్ కి వస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: