కరోనా కారణంగా బాగా నష్టపోయిన ఇండస్ట్రీల్లో చలన చిత్ర పరిశ్రమ కూడా ఒకటి. థియేటర్లు మూతబడి, షూటింగులు ఆగిపోయి, రోజువారి కూలీలకి ఇబ్బంది ఏర్పడి, ఏమి చేయాలో తెలియక, ఎప్పుడు సద్దుమణుగుతుందో అర్థం కాక, ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తూ, కరోనా నియంత్రణలోకి రావాలని ప్రార్థిస్తూ.. చేతిలో డబ్బులు లేక, నిర్మాతలు అప్పులు కట్టలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

 

చిన్న నిర్మాతల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. చేసిన అప్పులకి వడ్డీలు పెరిగిపోతున్నాయి. థియేటర్లేమో తెరుచుకోవడం లేదు. అసలు తెరుచుకునే పరిస్థితే కనిపించడం లేదు. ఒకవేళ తెరుచుకున్నా జనాలు మునుపటిలా సినిమా చూడడానికి వస్తారా అన్నది సందేహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరినీ ఆలోచనలో పడేస్తున్న ఒకే ఒక్క అంశం థియేటర్లు ఓపెన్ అయితే జనాల్ని ఎలా రప్పించాలా అని..

 

ఏం చేస్తే ప్రజలు థియేటర్లకి వస్తారు. ఎలాంటి మెజర్ మెంట్స్ పాటిస్తే థియేటర్లో సేఫ్టీ ఉంటుంది. థియేటర్ల కి వచ్చిన వారికి కరోనా భయం ఉండకుండా ఎలా చేయాలి అన్న అంశాలపై తీవ్ర చర్చ నడుస్తుంది. నిర్మాతల సంఘం, దర్శకుల సంఘాలన్నీ ఈ విషయమై బాగా డిస్కస్ చేస్తున్నాయి. ఈ మేరకు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మద్యం అమ్మితే జనాలు థియేటర్లకి వస్తారా అంటూ ప్రశ్నించాడు. 

 

ఇంకా ఇవే కాదు అతని మెదడులో చాలా ఆలోచనలు ఉన్నాయి. అయితే అవన్నీ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో అనుకుంటూ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటున్నాడు. టూరింగ్ టాకీస్ లలో సినిమా చూసినట్టు, కార్లలో కూర్చుని సినిమా చూసే వీలు కలిగిస్తే ఎలా ఉంటుందంటూ ప్రశ్నించాడు. అతనొక్కడే కాదు ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరూ ఇదే ఆలోచిస్తున్నారు. మరి అన్ని ఆలోచనలు కలిసి ఏ విధమైన అప్డేట్స్ తో ముందుకు వస్తారో చూడాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: