టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే రొమాంటిక్‌ సినిమాలకు, హాట్ హాట్ సీన్ల‌కు యూత్ నుంచి మాంచి రెస్సాన్స్ వ‌స్తోంది. సినిమాలో యాక్షన్‌, కామెడీ, ట్రాజడీలతో పాటు శృంగార సన్నివేశాలు కూడా అత్యంత కీల‌కంగా మారుతున్నాయి. యూత్‌తోపాటు సాధార‌ణ‌ ప్రేక్ష‌కులు కూడా వాటికి అల‌వాటైపోతున్నారు. నిర్మాతలకు కోట్లు సంపాదించిపెట్టడంలో ఈ సీన్లు ఎంతో కీలక పాత్ర పోశిస్తాయి. తెలుగులో రొమాంటిక్‌  సీన్లతో అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌100 వంటి అనేక సినిమాలు అనుకోని విజయాలను సాదించాయి. నిజానికి.. ఈమ‌ధ్య వ‌స్తున్న ప్ర‌తీ సినిమాలోనూ లిప్‌లాక్ కామ‌నైపోయింది. ఈ మద్య కాలంలో యూత్‌ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా లిప్‌లాక్‌, మరింత ఘాటు శృంగార స్ననివేశాలను కూడా చూసేస్తున్నారు. వాటిని సినిమాలో మంచి వినోదంగా భావిస్తున్నారు. డైలాగ్స్ కూడా బోల్డ్‌గా ఉంటున్నాయి. ప్రేక్ష‌కులు కూడా వాటిని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో సినిమాల‌పై వ్య‌తిరేక‌త కూడా వ‌స్తోంది. ఇలాంటి జుగుప్సాక‌ర‌మైన సీన్ల‌కు సెన్సార్ బోర్డు ఎలా అనుమ‌తి ఇస్తుంద‌ని, కుటుంబ స‌భ్యులంద‌రూ క‌లిసి సిన‌మాలు ఎలా చూస్తార‌ని, యూత్ పాడైపోతుంద‌ని కొంద‌రు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

అయితే క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి కొన‌సాగుతున్న లాక్‌డౌన్ నుంచి భారీగానే స‌డ‌లింపులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త్వరలోనే సినిమా షూటింగ్‌లు ప్రారంభమయ్యే అవకాశముంది. కానీ వాటిల్లో రొమాంటిక్‌ సన్నివేశాలు ఉండకపోవచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లాక్‌డౌన్‌ అనంతరం సినిమా షూటింగ్‌లకు ప్రభుత్వం ప్ర‌త్యేక మార్గనిర్దేశాలు ఇవ్వనున్నట్లు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇందులో భాగంగా సినిమాల్లో నటీన‌టులు అత్యంత సన్నిహితంగా మెదిలేందుకు అవకాశం లేనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఈ మద్యనే నియమాల విషయంలో 20 దేశాలకు చెందిన సినీ ప్రముఖులు ఆన్‌లైన్‌ సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా దేశంలో జరిగే విదేశీ చిత్రాల షూటింగ్‌లకు, విదేశాల్లో జరిగే మన షూటింగ్‌లకు నియమ నిబంధ‌నలను గురించి చర్చలు జరిపారు. దీంతో సినిమాల్లో ఇక ఆ టైప్ సీన్లు క‌నిపించ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పొచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: