పాయల్ రాజ్  పుత్... పాప చేసిన సినిమాలు తెలుగులో పట్టుమని పది కూడా లేకపోయినా సరే ఈమెకు తెలుగులో వచ్చిన ఆదరణ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. తెలుగులో ఎవరికి రాని క్రేజ్ ఆమెకు చాల అతక్కువ కాలంలో వచ్చింది అనేది వాస్తవం. ఆమెకు తెలుగులో వచ్చిన అవకాశాల గురించి పక్కన పెడితే ఆమె చేసిన సినిమాల గురించి ఒక్కసారి మాట్లాడితే తొలి సినిమాతో ఆమెకు ఫాన్స్ వచ్చినా సరే ఆమె కెరీర్ మొదట్లోనే అలాంటి సినిమాను చేయడం కరెక్ట్ కాదని ఆమె కెరీర్ ని అది బాగా ఇబ్బంది పెట్టింది అని కొందరు కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. 

 

కెరీర్ మొదట్లో అలాంటి సినిమాలు చేస్తే చిన్న చూపు చూస్తారని మంచి పాత్రలు రావాలి అంటే రావు అని ఇక స్టార్ హీరోల పక్కన ఆమెకు అవకాశాలు వచ్చే అవకాశం ఉండదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు అవకాశాలు వచ్చినా సరే అలాంటి ఆఫర్లే వచ్చాయి. ఆమెకు మహేష్ బాబు తో సినిమా చేసే అవకాశం వచ్చిన అసారే ఆమెకు ఉన్న ఇమేజ్ కారణం గా మహేష్ బాబు ఆమెను వద్దు అని చెప్పాడు అని టాలీవుడ్ వర్గాల్లో కొన్ని రోజులు చర్చ కూడా జరిగింది. మహేష్ బాబు అసలు ఆమెను పూర్తిగా వద్దు తన సినిమాలకు అడగవద్దు అని చెప్పాడు అని అన్నారు. 

 

ఆమె మహేష్ తో సినిమా చేయడానికి ఆసక్తి కూడా చూపించింది. ఇప్పుడు ఆమె చేతిలో ఒకటో రెండో సినిమాలు ఉన్నాయి గాని అవి స్టార్ హీరోల సినిమాలు కాదు. స్టార్ హీరోయిన్ అవుతుంది అని భావించినా సరే ఆమె మాత్రం నిలబడలేదు అనేది వాస్తవం. అందుకే ఆమె కెరీర్ ఆగిపోయింది అంటున్నారు టాలీవుడ్ జనాలు. ప్రస్తుతం వెంకటేష్ తో ఒక సినిమా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: