చిన్న వయసు లోనే హీరోయిన్ గా అడుగు పెట్టి చిన్న వయసు లోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి మన తెలుగులో స్టార్ హీరోయిన్ ఆవుతుంది అని భావించిన వారిలో హన్సిక ఒకరు. ఆమె 17 ఏళ్ళకే హీరోయిన్ గా అడుగు పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ తో అల్లు అర్జున్ తో ఆమె సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు కూడా మంచి హిట్ అవ్వడం తో ఆమెకు మంచి ఆఫర్లు వస్తాయి అని భావించారు అందరూ కూడా. కాని ఆమెను ఎవరూ కూడా పట్టించుకున్న సందర్భం అనేది తర్వాత తర్వాత లేకుండా పోయి చివరికి ఆమె ఐటెం గాళ్ గా మారిపోయింది అని అంటారు. 

 

ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినా సరే తెలుగు లో సినిమాలు చెయ్యాలి అని భావించి అమే తెలుగులో సినిమాలు చెయ్యాలి అనుకుని అక్కడి ఆఫర్లను వదిలి పెట్టింది అని అంటూ ఉంటారు. కాని మన తెలుగులో మాత్రం ఆమెను ఎవరూ సరిగా పట్టించుకోలేదు అని అందుకే ఆమె మన తెలుగు సినిమాలను పూర్తిగా వదిలేసి తమిళ సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది అని అంటారు. మన తెలుగులో ఆమెకు మంచి ఆఫర్లు కూడా వచ్చాయి. ఇప్పుడు కొన్ని వస్తున్నా సరే ఆమె వదులుకుంది అని అంటున్నారు. మరి దానికి కారణం ఏంటీ అనేది తెలియదు. 

 

ఆమె ప్రధానంగా అల్లు అర్జున్ తో చేసిన దేశ ముదురు సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం చాలానే జరుగుతుంది. ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు ఇక దూరం జరిగే ఆలోచనలో ఉందని వచ్చే ఏడాది ఆమె పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి చేసుకుంటుందో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: