థియేటర్లో రిలీజ్ చేయడానికి నిర్మించిన సినిమాలని థియేటర్లోనే రిలీజ్ చేయకుండా డైరెక్టుగా ఓటీటీలో ఎలా రిలీజ్ చేస్తారంటూ థియేటర్ల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా నిర్మించడం కోసం ఎన్నో అప్పులు చేసి ఉన్నామని, వాటిని తీర్చుకోవడానికి ఓటీటీకి అమ్మేస్తే తప్పేంటని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. కష్టకాలంలో మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరూ ఉండరంటూ నిర్మాతలు అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.

 

అయితే డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొన్ని మల్టీప్లెక్సుల యాజమాన్యాలు వార్నింగ్ కూడా పంపించాయి. అయితే తాజాగా మరో మల్టీప్లెక్స్ చైన్ సంస్థ ఈ వాదనకి విరుద్దంగా సమాధానం ఇచ్చింది. కొన్ని సినిమాలని ఆన్ లైన్లో రిలీజ్ చేయడం మంచిదే అని చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాత శ్రేయస్సు కోసం ఓటీటీలో రిలీజ్ చేసుకోవడం తప్పేమీ కాదని అంది.

 

అదీ గాక సినిమాలన్నీ క్యూలో ఉండిపోతే థియేటర్లు తెరుచుకున్నాక ఎవ్వరికీ సరైన అవకాశం రాకపోవచ్చనీ, అందువల్ల కొన్ని సినిమాలు అన్ లైన్లో రిలీజ్ అవ్వడమే బెస్ట్ అని చెప్పింది. అయితే అంతా బాగానే ఉందికానీ చివర్లో పెద్ద షాక్ ఇచ్చింది. ఒక్కసారి ఓటీటీలో రిలీజ్ అయ్యాక మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేయడానికి అవకాశమే లేదని తేల్చి పారేసింది. ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాకి థియేటర్లు ఇవ్వమని స్పష్టం చేసింది.

 


ప్రస్తుతానికి ఓటీటీలో రిలీజ్ చేసేసి, థియేటర్లు ఓపెన్ కాగానే అక్కడ కూడా రిలీజ్ చేద్దామన్నుకున్నవారికి ఈ వార్త షాక్ కలిగించింది. ఓటీటీలో ఇమ్మీడియెట్ గా డబ్బులు వస్తుండచ్చు కానీ, రీచ్ మాత్రం థియేటర్ల మాదిరిగా ఉండదు. సిటీల్లో ఎక్కువ మంది ఓటీటీలకి అలవాటు పడినా గ్రామీణ ప్రాంతాల్లో అంతగా లేదు. కాబట్టి అక్కడ రిలీజ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలని అనుకున్నవారికి అది కూడా ఉండదని తేల్చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: