ఏదేమైనా సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలి అంటే టాలెంట్ అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా బాగా కలిసి రావాలి. అదృష్టం ఉంటే టాలెంట్ కూడా అవసరం లేదు స్టార్ హీరోయిన్ గా మారిపోవచ్చు అని ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు కూడా నిరూపించారు. కానీ కొంత మంది హీరోయిన్లకు మాత్రం టాలెంట్ ఉండి అదిరిపోయే అందం ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం సాధించలేక పోతారు. వరుస అవకాశాలు చేజిక్కించుకున్నప్పటికీ అవి ఆ హీరోయిన్ల కెరియర్  కి అంతగా ఉపయోగపడవు. వరుస సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ రేంజికి వెళ్లకుండా  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కనుమరుగైన హీరోయిన్... రెజీనా కసాండ్రా. 

 

 తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మతి పోగొట్టి  హిట్ పుట్టించిన  విషయం తెలిసిందే. అంతేకాదు ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి మరి నటిస్తూ తన నటనతో కూడా ఆకట్టుకుంది. తన అందం అభినయంతో కూడా ఎంతో మంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. తన చిలిపి నవ్వుతో ఎంతో మంది దర్శక నిర్మాతలను ఆకర్షించింది. . హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నాటినుండి ఎన్నో సినిమాల్లో  నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ స్టార్ హీరోయిన్ రేంజికి మాత్రం ఎదగలేక పోయింది. 

 

 ఎందుకంటే  ఈ అమ్మడికి మొదటి నుంచి అదృష్టం అంతగా కలిసి రావడం లేదు. టాలెంట్ ఉన్నప్పటికీ అందం  ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం ఈ అమ్మడికి కలిసి రాకపోవడంతో ఈ అమ్మడు ఎన్ని సినిమాలు చేసినా అవి తన కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. దీంతో  తెలుగు చిత్ర పరిశ్రమలో మొదట్లో ఒక వెలుగు వెలిగిన రెజీనా కసాండ్రా ఆ తర్వాత మాత్రం అవకాశాలు లేక చేసిన సినిమాలు సరిగా ఆడక కనుమరుగైపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: