ప్రియా ప్రకాష్ వారియర్‌.. ఒకే ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ తో ఓవర్‌ నైట్‌ స్టార్‌గా ఎదిగిన అందాల భామ. 2018లో 'నీ వానం నాన్ మఝాయ్' రిలీజ్‌ కి ముందే క్రేజీ స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత 'ఒరు ఆదార్‌ లవ్' సినిమాలో కన్ను గీటే (వింక్ గర్ల్) సీన్‌ తో పాపులర్‌ అయిన ఈ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. 'ఒరు ఆదార్‌ లవ్' సినిమా తెలుగులో 'లవర్స్‌ డే' గా విడుదలైంది. ఈ సినిమా క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని చెప్పవచ్చు. ఈ కేరళ కుట్టి చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆశతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది ప్రియా వారియర్. మోడలింగ్ లో కూడా సత్తా చాటిన వింక్ గర్ల్ ప్రియా ప్రకాష్ వారియర్ కి సోషల్‌ మీడియాలో తెగ క్రేజ్‌ ఉంది. కుర్రకారును పిచ్చెక్కిచ్చే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చూస్తూ వారిని అలరిస్తుంటారు. దీంతో 7.2 మిలియన్‌ పైగా ఫాలోవర్స్‌ ను సంపాదించారు ప్రియా. ఫోటో లేక వీడియో పెట్టడం ఆలస్యం క్షణాల్లోనే వేలల్లో లైకులు.. లక్షల్లో వీక్షణలు వస్తుంటాయి.

 

ఈ మధ్యే టిక్‌ టాక్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ పలు వీడియోలతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ హఠాత్తుగా అభిమానులకు షాక్‌ కు గురిచేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తప్పుకున్నారు. కొందరు తనను పనికట్టుకొని ట్రోల్‌కు గురిచేస్తున్నారనే అసహనంలో ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం కొద్ది రోజులు మాత్రమే సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానిని.. త్వరలోనే తిరిగి వస్తానని సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ మలయాళ బ్యూటీ ఇన్‌స్టా నుంచి ఎందుకు తప్పుకుంటున్నారో అధికారికంగా తెలియనప్పటకీ ఈ నిర్ణయంతో ఆమె అభిమానులు మాత్రం కలవరపడుతున్నారు. ఇదిలా ఉండగా ప్రియా వారియర్ యంగ్ హీరో నితిన్ సరసన ఓ సినిమాలో నటించబోతుందని సమాచారం. ఈ సినిమాకు చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు. అంతేకాకుండా తాజాగా మహేష్ బాబు సినిమాలో ప్రియా యాక్ట్ చేస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ దీని గురించి ఎలాంటి ఆఫీసియల్ ఇన్ఫర్మేషన్ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: