టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ నమిత. ఆఫర్లు రావడం వాటిని ఆమె వాడుకునే విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేయడం ఏ సినిమాకు అయినా సరే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి మనం చూసాం. అయితే ఆమె తనకు వచ్చిన ఆఫర్లను వాడుకోవడం లో మాత్రం చాల వరకు విఫలం అయింది అని చెప్తూ ఉంటారు టాలీవుడ్ జనాలు. దానికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా సరే ఆమె కొన్ని ఆఫర్లను వాడుకోవడం లో విఫలం అయింది అనేది మాత్రం వాస్తవం. 

 

ఆమె బాలకృష్ణ సహా కొందరు హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఆ సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వచ్చిన సమయంలో బరువు తగ్గండి అని ఇచ్చిన సలహాలను ఆమె పెద్దగా పాటించలేదు. అందుకే ఆమెను పక్కన పెట్టారు అని అంటూ ఉంటారు. ఆఫర్లు వచ్చిన సమయంలో దర్శకుని ఆలోచనకు తగిన విధంగా ఉండాలి అని కాని ఆమె అలా చేయలేదు అని అంటారు. అందుకే ఆమెను పక్కన పెట్టాల్సి వచ్చింది అంటారు. ఆమె ను జీరో సైజ్ అవ్వకపోయినా కాస్త తగ్గాలి అని సూచనలు చేసిన సరే ఆమె మాత్రం వినలేదు. 

 

మన తెలుగులో ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆ ఫాలోయింగ్ ని ఆమె వాడుకోవడంలో ఘోరంగా విఫలం అయింది అనే విషయం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. తమిళంలో ఆమె పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తుంది. ఆమె సినిమాలకు ఇప్పుడు అంతగా డిమాండ్ లేదు. మన తెలుగులో ఆమె అప్పుడు దర్శక నిర్మాతలు చెప్పిన విధంగా చేసి ఉంటే ఆమెకు మంచి క్రేజ్ తో పాటుగా హోదా కూడా వచ్చేది.

మరింత సమాచారం తెలుసుకోండి: